Madhyapradesh : మధ్యప్రదేశ్‌లోని సియోని జిల్లాలో భారీ వర్షాల కారణంగా ప్రసవ వేదనతో బాధపడుతున్న మహిళను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లలేకపోయారు. డాక్టర్ వీడియో కాల్ ద్వారా ప్రసవంలో మంత్రసానికి సహాయం చేసి, మహిళను కాపాడారు. బాలీవుడ్ సినిమా ‘త్రీ ఇడియట్స్’ చూడని వారు ఉండరు. ఇందులోని ఓ సన్నివేశం చాలా పాపులర్. అది మోనా సింగ్ డెలివరీ సీన్. ల్యాప్‌టాప్‌లో ఎలా డెలివరీ చేయాలో కరీనా కపూర్ అమీర్ ఖాన్‌కి చూపుతుంది. అప్పుడు మోనా సింగ్ ఒక అందమైన బిడ్డకు జన్మనిస్తుంది. మధ్యప్రదేశ్‌లోని సియోని జిల్లాలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఇక్కడ కురుస్తున్న వర్షాల కారణంగా ప్రసవ వేదనతో బాధపడుతున్న మహిళను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లలేకపోయారు.
Read Also:Anasuya Bharadwaj: మీకు అది చేతకాదు.. దుమారం రేపుతున్న అనసూయ ట్వీట్!
అటువంటి పరిస్థితిలో, డాక్టర్ వీడియో కాల్ ద్వారా ప్రసవంలో మంత్రసానికి సహాయం చేసి, మహిళకు సురక్షితంగా రక్షించగలిగారు. ఈ సమయంలో ఆ మహిళ కవల పిల్లలకు జన్మనిచ్చింది. సోమవారం జోరవాడి గ్రామంలో రవీనా ఉయికే అనే మహిళ ప్రసవ నొప్పితో బాధపడుతుంది. దీంతో ఆమెను జిల్లా ఆస్పత్రికి తరలించాలని కుటుంబసభ్యులు నిర్ణయించుకున్నప్పటికీ రోడ్డుపై నీరు చేరడంతో ఆస్పత్రికి తీసుకెళ్లలేకపోయారు. రవీనా ఉయికే పరిస్థితి గురించి సమాచారం అందుకున్న తరువాత, జిల్లా ఆరోగ్య అధికారి డాక్టర్ మనీషా సిర్సామ్‌తో పాటు ఆరోగ్య అధికారుల బృందాన్ని గ్రామానికి పంపారు. అయితే రోడ్లన్నీ మునిగిపోయాయి. జట్టు ఎట్టి పరిస్థితుల్లోనూ గ్రామానికి చేరుకోవడం అసాధ్యం అనిపించినప్పుడు, డాక్టర్ సిర్సామ్ ఉయికే భర్తకు ఫోన్ చేసి, గ్రామంలోని శిక్షణ పొందిన మంత్రసానిని తమ ఇంటికి పిలిపించమని కోరాడు.
కవలలకు జన్మ
అధిక ప్రమాదం ఉన్న మహిళ డెలివరీ అయ్యేలా ఫోన్‌లో ఇచ్చిన సూచనలను పాటించమని సిర్సామ్ మంత్రసాని రేష్మా వంశ్‌కర్‌ను కోరింది. మంత్రసాని సూచనలను శ్రద్ధగా పాటించి, కవలలు సురక్షితంగా పుట్టేలా చూసింది. నీటి మట్టం తగ్గుముఖం పట్టి వాహనాల రాకపోకలకు అనువుగా మారడంతో మహిళతో పాటు అప్పుడే పుట్టిన కవలలను 108 వాహనం ద్వారా జిల్లా ఆస్పత్రికి తరలించారు. తల్లి, కవలలు ఆరోగ్యంగా ఉన్నారని ఆరోగ్య అధికారి తెలిపారు.