Site icon NTV Telugu

Share Market: మార్కెట్‌పై గత వారం ఎఫెక్ట్.. నష్టాల్లోనే ప్రారంభమైన సెన్సెక్స్, నిఫ్టీ

Stock Markets

Stock Markets

Share Market: దేశీయ స్టాక్ మార్కెట్ అద్భుతమైన ర్యాలీకి గత వారం బ్రేక్ పడింది. రెండు రోజులు విరామం తర్వాత కూడా పరిస్థితి అలాగే ఉంది. =రికార్డు స్థాయికి చేరిన తర్వాత మార్కెట్లో మొదలైన ప్రాఫిట్ బుకింగ్ ఇంకా ఆగడం లేదు. గత వారం నుండి ఏర్పడిన ఒత్తిడి ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉండటానికి ఇదే కారణం. ఈ కారణంగా కొత్త వారం మొదటి రోజు అంటే సోమవారం, ప్రధాన దేశీయ సూచీలు BSE సెన్సెక్స్, NSE నిఫ్టీ రెండూ నష్టాల్లోనే ట్రేడింగ్ ప్రారంభించాయి.

Read Also:Income Tax Slab: మోడీ సర్కార్ శుభవార్త.. ఐటీఆర్ దాఖలు చేసిన కోట్లాది మందికి ప్రయోజనం

అంతకుముందు శుక్రవారం రెండు సూచీలు నష్టాల్లో ముగిశాయి. వారం చివరి రోజైన శుక్రవారం 106 పాయింట్లకు పైగా పడిపోయి 66,160 పాయింట్ల దగ్గర ముగిసింది. వారం మొత్తం కూడా మార్కెట్ నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. గత వారంలో 30-షేర్ల BSE సెన్సెక్స్ 524.06 పాయింట్లు లేదా 0.78 శాతం నష్టంలో ఉంది. నిఫ్టీ వారంలో నష్టాలతో 19,646 వద్ద ముగిసింది. జులై 20న దేశీయ మార్కెట్ రికార్డు స్థాయిలో నమోదైంది. ఆ రోజు సెన్సెక్స్ తన సరికొత్త ఆల్ టైమ్ గరిష్ట స్థాయి 67,619.17 పాయింట్లను సాధించింది. అప్పటి నుంచి మార్కెట్ ఒత్తిడిలో ఉంది. వరుసగా 3 వారాల పాటు అద్భుతమైన లాభాలు చూసిన తర్వాత దేశీయ స్టాక్ మార్కెట్ గత వారం నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. ఇప్పటికీ మార్కెట్‌లో అదే ఒత్తిడి కనిపిస్తోంది.

Read Also:Support Moranchapalli: దయనీయ స్థితిలో మోరంచపల్లి వాసులు.. ఆపన్న హస్తం కోసం ఎదరుచూపు

Exit mobile version