Sangareddy: దేశంలో ఎన్ని చట్టాలు వచ్చినా మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా దుర్మార్గులు నేరాలకు పాల్పడుతున్నారు. గతేడాది జరిగిన ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం కేసులో సంగారెడ్డి ఫాస్ట్‌ట్రాక్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. పోక్సో కేసులో నిందితుడికి మరణ శిక్ష విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. గతేడాది అక్టోబర్ 16న ఐదేళ్ళ బీడీఎల్ భానూరులో ఐదేళ్ల చిన్నారిపై ఘాతుకానికి పాల్పడ్డ గపూర్(56)కు న్యాయస్థానం మరణశిక్ష విధించింది. బీహార్‌కు చెందిన గపూర్ భానూరులో నివాసం ఉంటున్నాడు. కూల్‌డ్రింక్‌లో మద్యం కలిపి బాలికపై నిందితుడు అత్యాచారం చేశాడు. ఈ కేసులో చిన్నారి కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా 11 నెలల్లో విచారించి కేసుపై తీర్పు వచ్చేలా సంగారెడ్డి ఎస్పీ రూపేష్ కుమార్ చేశారు. 27 ఏళ్ల తర్వాత మరణశిక్ష విధించడం జిల్లాలో ఇదే తొలిసారి.
Read Also: Sitaram Yechury: సీతారాం ఏచూరి భౌతికకాయం ఎయిమ్స్‌కు దానం