NTV Telugu Site icon

Software Employee Case: సాఫ్ట్‌వేర్ ఉద్యోగి నాగరాజు హత్య కేసులో సంచలన విషయాలు

Software Engineer Case

Software Engineer Case

Software Employee Case: తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం గంగుడుపల్లెలో జరిగిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి నాగరాజు హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నాగరాజు హత్యకు తమ్ముడి వివాహేతర సంబంధంతో పాటు ఆర్థిక కారణాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. హత్యకు ముందు రోజు నిందితుడు రిపుంజయ, మృతుడు నాగరాజు ఫోన్‌లో మాట్లాడుకున్న ఆడియో లీక్ అయింది. మర్డర్ మోటివ్ వెనుక అక్రమ సంబంధంతో పాటు నగదు లావాదేవీలు ఉన్నట్లు తెలుస్తోంది.

నిందితుడు రిపుంజయ, మృతుడు నాగరాజు ఫోన్‌ సంభాషణ ఒకటి బయటకు రాగా.. ఆ ఆడియోలో నా భార్యతో అక్రమ సంబంధం పెట్టుకుంటారా… మీ అంతు చూస్తానని పురుషోత్తం అన్న నాగరాజును నిందితుడు రిపుంజయ బెదిరించాడు. విషయం చెపితే తన తమ్ముడు పురుషోత్తంతో క్షమాపణలు చెప్పిస్తానని నాగరాజు రిపుంజయతో అన్నాడు. ఎంత చెప్పినా వినకుండా రిపుంజయ ఆవేశాన్ని పెంచుకుని అసభ్యంగా మాట్లాడడంతో నాగరాజు తిరగబడ్డాడు. తన దగ్గర తీసుకున్న డబ్బులు తిరిగి ఇచ్చేయాలని రిపుంజయను నాగరాజు అడిగాడు. నగదు, అక్రమ సంబంధం కారణంగా తమ్ముడు కోసం అన్న నాగరాజు బలి అయినట్లు తెలుస్తోంది.

Read Also: Delhi: 16 ఏళ్ల బాలికపై మైనర్ బాలుడి అత్యాచారం..

అసలేం జరిగిందంటే..

వివరాల ప్రకారం .. బ్రాహ్మ ణపల్లికి చెందిన నాగరాజు.. తిరుపతి నుంచి వెళ్తుం డగా గంగుడుపల్లె దగ్గర ఆయన కారు మంటల్లో కాలి బూడిదైంది. నాగరాజు ఆ కారులోనే సజీవ దహనం అయ్యా డు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వ డం తో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అక్క డున్న వస్తువులు, కారు నంబర్‌ ప్లేట్‌ ఆధారంగా మృతుడు నాగరాజుగా గుర్తించారు. పోలీసులు విచారించగా.. ఇది హత్య అని, దీనికి మృతుడి తమ్ముడి వివాహేతర సంబంధమే కారణమని తెలిసింది. తమ్ముడి వివాహేతర సంబంధం కారణంగా అన్న ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. నాగరాజు తమ్ము డు పురుషోత్తంకు అదే గ్రామానికి చెందిన మరో మహిళతో వివాహేతర సంబంధం ఉండేది. ఈ విషయంపై రెండు కుటుంబాల మధ్య పంచాయితీ జరిగింది. ఈ నేపథ్యంలోనే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి హత్య జరిగింది. కాగా, నాగరాజుకు భార్య , ఇద్దరు పిల్లలున్నారు.