TEJESHWAR Case: గద్వాల తేజేశ్వర్ మర్డర్ కేసు.. అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి..
- గద్వాల తేజేశ్వర్ మర్డర్ కేసు
- అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి
- తేజేశ్వర్ మర్డర్ కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గద్వాల తేజేశ్వర్ మర్డర్ కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసులో ఇద్దరు నిందితులు ఐశ్యర్య, తిరుమల రావు.. మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసును నిశితంగా పరిశీలించారు. అక్కడ భార్య.. భర్తను చంపేసి దొరికిపోయింది. కానీ అలా దొరకకుండా పక్కా ప్లాన్ ప్రకారం ఎస్కేప్ కావాలని స్కెచ్ వేశారు. కానీ వారు రీల్స్‌లో కలలు కన్నది వేరు రియల్‌గా జరిగింది వేరు. మొత్తంగా ప్లాన్ బెడిసి కొట్టి ఇద్దరూ ఇప్పుడు ఊచలు లెక్కపెడుతున్నారు.
Also Read:Zohran Mamdani: “స్టాట్యూ ఆఫ్ లిబర్టీ”కి బుర్ఖా.. మమ్దానీ గెలుపు తర్వాత ఇస్లామోఫోబిక్ పోస్టులు..
Also Read
- Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
- CM Revanth Reddy : ఎమ్మెల్యేలు జమీందార్లలా మారొద్దు.. పార్టీ కోసం పనిచేయాల్సిందే
- Ravindra Jadeja: రవీంద్ర జడేజాకు ఏమైంది.. మ్యాచ్ మధ్యలో ఎందుకు వెళ్లిపోవాల్సి వచ్చింది..?
- Russia-Taliban: రష్యా-ఆప్ఘనిస్థాన్ మధ్య సైనిక ఒప్పందం.. ఎవరికి ముప్పు పొంచి ఉందో..!
అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి
గద్వాలకు చెందిన తేజేశ్వర్ మర్డర్ కేసులో.. తవ్వినకొద్దీ కొత్త కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. కట్టుకున్న భార్య ఐశ్యర్య.. అతన్ని చంపేద్దామని స్కెచ్ వేసేనాటికి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ హానీమూన్ మర్డర్ కేసు వెలుగులోకి వచ్చింది. దీంతో అదే కేసును.. ప్రియుడు తిరుమలరావుతో కలిసి అధ్యయనం చేసింది ఐశ్వర్య. ఇద్దరూ ఈ కేసును బాగా స్టడీ చేసి.. మేఘాలయ మర్డర్ కేసులో రాజారఘువంశీని చంపిన భార్య సోనమ్ తరహాలో దొరికిపోవద్దని బలంగా నిర్ణయం తీసుకున్నారు. దొరకకుండా పక్కా ప్లాన్ సిద్ధం చేసుకున్నారు. మర్డర్ పని పూర్తి చేసుకుని లద్దాఖ్ వెళ్లి స్థిరపడాలని కలలు కన్నారు. కానీ వారి కలలన్నీ కల్లలే అయ్యాయి.
Also Read:CPI Narayana: స్టార్ హీరోలు, హీరోయిన్స్‌ను టార్గెట్ చేసిన సీపీఐ నారాయణ.. ఎందుకంటే..?
ఐశ్వర్య, తిరుమల్ మధ్య 24 గంటల పాటు వీడియో కాల్
నిజానికి బ్యాంకు మేనేజర్‌గా పని చేస్తున్న తిరుమలరావుకు అప్పటికే పెళ్లి అయింది. మంచి ఉద్యోగం… మంచి జీవితం… అయినా ఐశ్వర్య ప్రేమలో బాగా మునిగిపోయాడు. అలా అలా చాలా చాలా దూరం వెళ్లిపోయింది వారి యవ్వారం. ఐశ్వర్య, తిరుమల్ 24 గంటల పాటు వీడియో కాల్లో ఒకరినొకరు చూసుకుంటూనే ఉండేవారని తెలుస్తోంది. బ్యాంక్‌లో వర్క్ చేస్తున్నా.. పక్కనే మొబైల్లో వీడియో కాల్ రన్ అవుతూనే ఉండేదని చెబుతున్నారు. ఆమె ఇంట్లో ఏ పని చేసుకుంటున్నా తిరుమల్‌తో వీడియో కాల్లో టచ్‌లో ఉండేదంటే వారి పిచ్చి ఎంత ముదిరిపోయిందో తెలుస్తోంది.
Also Read:CPI Narayana: స్టార్ హీరోలు, హీరోయిన్స్‌ను టార్గెట్ చేసిన సీపీఐ నారాయణ.. ఎందుకంటే..?
కూతురుకు పెళ్లి చేయొద్దా? అనుకుంది తల్లి
ఎంగేజ్మెంట్ అయినప్పటి నుంచే.. మర్డర్ ప్లాన్ రెడీ
కొన్నాళ్లకు ఐశ్వర్య తల్లికి ఓ భయం మొదలైంది. తామిద్దరం ఇక జీవితాంతం ఇలానే మిగిలిపోవాలా? తన కూతురుకు పెళ్లి చేయొద్దా? అనుకుంది. సీన్ కట్ చేస్తే.. సర్వే వర్క్స్ చేసే తేజేశ్వర్‌తో ఐశ్వర్య పెళ్లి జరిగిపోయింది. కానీ తేజేశ్వర్ బ్యాడ్ లక్.. ఎంగేజ్మెంట్ అయినప్పటి నుంచే.. మర్డర్ ప్లాన్ రెడీ చేశారు ఐశ్వర్య అండ్ తిరుమల్. అయితే.. ఆ పెళ్లి తనకు ఇష్టమే అన్నట్టు నటించింది కిలాడీ ఐశ్వర్య. తేజేశ్వర్తోనూ ప్రేమగా ఉంటున్నట్టు యాక్ట్ చేసింది. కాపురం చేస్తూనే తిరుమల్‌తో కలిసి తన భర్తను లేపేయాలని స్కెచ్ వేసింది. పెళ్లి అయ్యాక కూడా అతనికి వీడియో కాల్లో రోజూ కాంటాక్ట్‌లో ఉండేది ఐశ్వర్య.
Also Read:CPI Narayana: స్టార్ హీరోలు, హీరోయిన్స్‌ను టార్గెట్ చేసిన సీపీఐ నారాయణ.. ఎందుకంటే..?
లఢక్ కానీ, అండమాన్ కానీ వెళ్లి సెటిల్ అవ్వాలని ప్లాన్
ఇక మర్డర్ స్కెచ్ వేసిన తిరుమల్‌రావు ఆ దిశగా ప్రయత్నాలు షురూ చేశాడు. ఈ క్రమంలోనే అతడు మేనేజర్‌గా చేస్తున్న బ్యాంక్‌కు నగేశ్ అనే అతను లోన్ కోసం వచ్చాడు. అతనికి క్రిమినల్ బ్యాక్‌గ్రౌండ్ ఉందని తెలిసి తేజేశ్వర్‌ను చంపాలని ప్రపోజల్ పెట్టాడు. తాను చెప్పిన అతన్ని చంపిస్తే.. ఎన్ని లక్షలు కావాలంటే అన్ని లోన్ ఇచ్చేస్తానంటూ ఆఫర్ ఇచ్చాడు. అందుకు నగేశ్ ఓకే అన్నాడు. అలా ఓ సుపారీ గ్యాంగ్ కూడా రెడీ అయింది.
Also Read:Health Tips: ఉత్తమమైన ఆరోగ్యానికి.. బెస్ట్ కార్బోహైడ్రేట్ ఆహారాలు ఇవే
ఇక తేజేశ్వర్‌ను చంపడమే మిగిలింది. చాలాసార్లు అటెంప్ట్ చేసినా అవన్నీ జస్ట్‌లో మిస్ అయ్యాయి. భర్తను చంపేసి.. తిరుమల్‌తో కలిసి లఢక్ కానీ, అండమాన్ కాని పారిపోయి కొన్నాళ్లు అక్కడ సెటిల్ అవ్వాలని అనుకున్నారు. అంతలోనే మేఘాలయ హనీమూన్ జంట మర్డర్ కేసు వెలుగు చూసింది. ఆ కేసు చూసి భయపడాల్సింది మానేసి.. ఆ హంతకులు చేసిన తప్పులు మనం చేయొద్దంటూ మరింత పక్కాగా ప్లాన్ చేసి మరీ తేజేశ్వర్‌ను చంపేయాలని అనుకున్నారంటే వారెంత క్రిమినల్ మైండెడ్‌గా ఉన్నారో తెలుస్తోంది.
Also Read:CPI Narayana: స్టార్ హీరోలు, హీరోయిన్స్‌ను టార్గెట్ చేసిన సీపీఐ నారాయణ.. ఎందుకంటే..?
రియల్ ఎస్టేట్ చేస్తామంటూ నమ్మించారు
వన్ ఫైన్ మార్నింగ్ సుపారీ టీమ్‌లోని వ్యక్తులు ముందుగా తేజేశ్వర్‌తో పరిచయం పెంచుకున్నారు. ఫ్రెండ్ షిప్ చేశారు. అతను సర్వేయర్ కావడంతో తాము రియల్ ఎస్టేట్ చేస్తామంటూ నమ్మించారు. తేజేశ్వర్ ఎక్కడికి వెళుతున్నాడో తెలుసుకోవడానికి అతని వాహనానికి జీపీఎస్ ట్రాకర్ కూడా అమర్చారు. ఓ రోజు ల్యాండ్ చూద్దామంటూ నిర్మానుష్య ప్రదేశానికి కారులో తీసుకెళ్లారు. కారులోనే వేట కొడవళ్లతో తలపై వేటు వేశారు. కడుపులో పొడిచారు. అ తర్వాత తేజేశ్వర్ డెడ్‌బాడీని కర్నూల్ ఏరియాలో నాలాలో పడేశారు. మర్డర్ చేసే టైమ్‌లో తిరుమల్‌తో హంతకులు ఫోన్ కాల్లో మాట్లాడుతూనే ఉన్నారు.
Also Read:Revanth Reddy: రామ్‌చరణ్ చిన్నప్పటి నుంచే తెలుసు.. విజయ్ దేవరకొండది మా పక్క ఊరే..
దుస్తులకు రక్తం మరకలు అయితే కొత్త బట్టలు కొని తీసుకొచ్చాడు తిరుమల్. ఇలా ఈ కేసులో బ్యాక్ మేనేజర్ తిరుమల్‌రావు, అతని లవర్ ఐశ్వర్య కీలక సూత్రధారిగా ఉన్నారు. ఐశ్వర్య తల్లి సుజాతతో పాటు 8మందిని అరెస్ట్ చేశారు జోగులాంబ గద్వాల జిల్లా పోలీసులు. హత్యకు వాడిన కారు, 2 కొడవళ్ళు, కత్తి, 10 మొబైల్స్, జిపిఎస్ ట్రాకర్, లక్షా 20వేల క్యాష్ స్వాధీనం చేసుకున్నారు. A1గా తిరుమలరావు, A2గా ఐశ్వర్య, A8 సుజాతను చేర్చారు పోలీసులు.
తాజావార్తలు
-
Story Board: కర్ణాటకలో సీఎం మార్పునకు కారణాలేంటి..?
-
Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
-
Honor Win Turbo: హానర్ విన్ టర్బో రిలీజ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా
-
CM Revanth Reddy : ఎమ్మెల్యేలు జమీందార్లలా మారొద్దు.. పార్టీ కోసం పనిచేయాల్సిందే
-
Ravindra Jadeja: రవీంద్ర జడేజాకు ఏమైంది.. మ్యాచ్ మధ్యలో ఎందుకు వెళ్లిపోవాల్సి వచ్చింది..?
ట్రెండింగ్
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..