NTV Telugu Site icon

Harsha Sai Case : ‘మెగా’ సినిమా కాపీ రైట్స్ కోసమే బాధితురాలితో ప్రేమ, పెళ్లి అంటూ మోసం

Harsha Sai

Harsha Sai

ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి పై నమోదైన లైంగిక ఆరోపణల నేపథ్యంలో నార్సింగ్ పోలీసులు దర్యాప్తును తీవ్రంగా ముందుకు తీసుకెళ్లుతున్నారు. ఆయన విదేశాలకు పారిపోయే ప్రయత్నం చేస్తున్నాడంటూ, బాధితురాలు సైబరాబాద్ సీపీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, హర్ష సాయి పై లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. బాధితురాలితో సన్నిహితమైన హర్ష సాయి, ‘మెగా’ సినిమా కాపీ రైట్స్ కోసం ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ ఆమె ఆరోపించింది. ఈ ఫిర్యాదు చేసిన తర్వాత, హర్ష సాయి పరారీలో ఉన్నాడు, పోలీసులు అతన్ని వెతుకుతున్నారు.

CM Revanth Reddy : కాకా పేదల మనిషి.. ఆయన పేదోళ్ల ధైర్యం..

అయితే.. ఈ నేపథ్యంలోనే బాధితురాలి తరుఫు న్యాయవాది నాగుర్ బాబు మీడియాతో మాట్లాడుతూ.. హర్షసాయి కేసులో చాలా అపోహలు వినబడుతున్నాయన్నారు. హర్ష సాయి దేశం వదిలి పెట్టి పోయాడని, తన టీమ్ ఇక్కడ అందరిని మేనేజ్ చేస్తున్నాయన్నారు. హర్ష సాయి బెట్టింగ్ మాఫియా బయటకు తెచ్చామని, మీడియా సంస్థల మీద కేసులు వేస్తున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, బాధితురాలు ను మానసిక క్షోభకు గురి చేస్తున్నారని ఆయన అన్నారు. హర్ష సాయి కొన్ని అడియోలు , వీడియో లను సోషల్ మీడియా ద్వారా రీలీజ్ చేసి బాధితురాలును ఇబ్బంది కి గురి చేస్తున్నారని ఆయన ఆరోపించారు. హైకోర్టు అలాంటి వాటిపై సీరియస్ కావడం జరిగిందని ఆయన తెలిపారు. వెంటనే సోషల్ మీడియా లో ఉన్న పోస్టులు, క్లిపింగ్స్ తీసివేయాలని హైకోర్టు ప్రభుత్వం కు ఆదేశాలు ఇచ్చిందని, బాధితురాలు పేరును ప్రస్తావిస్తూ కొన్ని సోషల్ మీడియా ట్రోల్ చేస్తున్నారన్నారు.

West Bengal: ట్రైనీ డాక్టర్ ఘటన మరవక ముందే.. బెంగాల్‌లో మైనర్ బాలికపై దారుణం..

హర్ష సాయి తండ్రి పేరు FIR లో లేకపోయిన హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారని, హైకోర్టు వారి బెయిల్ పిటిషన్ ను కొట్టివేసిందన్నారు.. అంతేకాకుండా.. రెండు కోట్లు రూపాయలు బాధితురాలు అడిగినట్లు చెపుతున్నారని, బాధితురాలు ఎక్కడ డబ్బులు డిమాండ్ చేయలేదన్నారు. మెగా సినిమా కాపీ రైట్స్ తీసుకోవాలనే ఉద్దేశ్యం తోనే ప్రేమ, పెళ్లి పేరుతో హర్షసాయి మోసం చేసాడని న్యాయవాది నాగురు బాబు తెలిపారు. మెగా సినిమా కేవలం టీజర్ మాత్రం విడుదల చేసామని, అస్సలు పూర్తి సినిమా తీయలేదని ఆయన వెల్లడించారు.. అనంతరం.. మెగా సినిమా కో ప్రొడ్యూసర్ బాలాచాంధర్ మాట్లాడుతూ.. ఒక మహిళా ధైర్యంగా బయటకు వచ్చి కేసు పెట్టిందని, మెగా సినిమా లో ఒక సాంగ్ కోసం వీళ్ళు పరిచయం అయ్యారని, శ్రీ పిచ్చర్స్ ద్వారా ఒక పాట కోసం కలిశారన్నారు.

Show comments