Rajiv Ratan: సీనియర్ ఐపీఎస్ అధికారి, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీ రాజీవ్ రతన్ గుండెపోటుతో కన్నుమూశారు. రాజీవ్ రతన్ ప్రస్తుతం విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీగా కొనసాగుతున్నారు. ఉదయం ఛాతినొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఏఐజీ హాస్పిటల్‌కు తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందారు.
Read Also: Lok Sabha Polls: తొలిదశలో 1625 మంది అభ్యర్థులు.. అందులో 252 మంది నేరచరితులే..
రజీవ్ రతన్ మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు. రాష్ట్రానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. 1991 బ్యాచ్‌కు చెందిన రాజీవ్ రతన్ ఇటీవల కాలంలో విజిలెన్స్ డీజీగా నియామకమయ్యారు. విజిలెన్స్ డీజీ నియమించిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టుపై రాజీవ్ రతన్ విచారణ జరిపారు. రాజీవ్ రతన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా జ్యుడీషియల్ కమిషన్‌ను ప్రభుత్వం నియమించింది. గతంలో ఆయన కరీంనగర్ ఎస్పీగా పని చేశారు. అలాగే ఆపరేషన్ ఐజీగా, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా వివిధ హోదాల్లో పని చేశారు.