Nirosha: ఇటీవల దొంగలు ఆచి తూచి సెలబ్రిటీల ఇళ్లకే కన్నాలు పెడుతున్నారు. ఈ మధ్య కాలంలో సినీ పరిశ్రమకు చెందిన వారి ఇళ్లలో దొంగతనాల వార్తలను మనం వింటూనే ఉన్నాం. గతంలో ఐశ్వర్య రజనీకాంత్, శోభన, సింగర్ విజయ ఏసుదాస్ లాంటి వారు ఇళ్లలో చోరీ జరిగిన విషయం తెలిసిందే. తాజాగా మరో సీనియర్ హీరోయిన్ నిరోషా ఇంట దొంగతనం జరిగింది. చెన్నైలోని తన ఇంట్లో బంగారు ఆభరణాలను దొంగలించారంటూ నిరోష తేనంపేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తన ఇంట్లో నగలు, డబ్బుతో పాటు కొన్ని ఆస్తి పత్రాలు కూడా మాయమయ్యాయి అంటూ ఫిర్యాదు చేశారు నిరోషా. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Read Also:Sangareddy: సంగారెడ్డిలో ఉద్రిక్తత.. SFI, ABVP విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణ
గతమార్చి నెలలో ఐశ్వర్య రజనీకాంత్ ఇంట దొంగతనం కేసులో ఇంటి దొంగ ఎవరో పోలీసులు కనిపెట్టారు. ఆమె ఇంట్లో పనిమనిషి దొంగతనం చేసినట్లు గుర్తించారు. అలాగే యాక్టర్ శోభన ఇంట్లో దొంగతనం విషయంలో కూడా ఇదే జరిగింది ఆమె ఇంట్లో పనిమనిషే దొంగతనానికి పాల్పడింది. ఇక సింగర్ విజయ్ ఏసుదాస్ ఇంట దొంగతనంలో ఇప్పటివరకు దర్యాప్తు కొనసాగుతుంది. ఇక పాత ఘర్షణ సినిమాలో హీరోయిన్ నటించిన నిరోషా ఈ సినిమాతో యూత్ కు ఎంతగానో దగ్గర అయింది. ఈ సినిమాలో ఆమె ఒక బృందావనం.. సోయగం.. అంటూ స్విమ్మింగ్ పూల్ లో హొయలొలికించ్చింది. ఇప్పటికీ ఆ పాట యూట్యూబులో మారుమోగిపోతూనే ఉంటుంది. సింధూరపువ్వు సినిమా కూడా ఆమెకు మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది. కానీ తర్వాత పెద్దగా సినిమాలు లేకపోవడంతో నిరోషా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె లాల్ సలాంలో రజనీకాంత్ భార్యగా నటిస్తుందట.
Read Also:Viral Video: ఈ కొంగ ఏంటి పిల్లను అలా పడేసింది? కారణం అదే అయ్యింటుందా?
