NTV Telugu Site icon

Congress Leader Passed Away: కాంగ్రెస్ సీనియర్ నేత కన్నుమూత..

Arif Akil

Arif Akil

మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఆరిఫ్‌ అకిల్‌ కన్నుమూశారు. ఆయన చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆరిఫ్ అకిల్ భోపాల్ నార్త్ అసెంబ్లీ స్థానం నుంచి 6 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అదే సమయంలో.. అతను రెండుసార్లు మధ్యప్రదేశ్ ప్రభుత్వంలో మంత్రి చేశారు. మైనారిటీ సంక్షేమం, జైళ్లు, ఆహార శాఖ బాధ్యతలను ఆయన నిర్వర్తించారు. ఆరిఫ్ అకిల్ 1990లో తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఆరిఫ్ అకిల్ తన కొడుకు అతిఫ్ అకిల్ ను భోపాల్ నార్త్ సీటు నుంచి 2023లో బరిలో నిలిపారు. అతిఫ్ అకిల్ భారీ మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే.

READ MORE: Teacher Sleeping In School: ఈ టీచరమ్మ రూటే సపరేటు.. నిదురపోతున్న ఆమె పిల్లలతో? (వీడియో)

భోపాల్ గ్యాస్ లీక్ ప్రమాద బాధితులకు సాయం..
1984లో భోపాల్‌లో జరిగిన యూనియన్ కార్బైడ్ గ్యాస్ లీక్ ఘటన తర్వాత ఆరిఫ్ అకిల్ ప్రజల్లో తన ఇమేజ్‌ను పెంచుకోగలిగారు. ఫ్యాక్టరీకి కొంత దూరంలో ఆరిఫ్ నగర్ అనే పట్టణాన్ని స్థాపించారు. గ్యాస్ దుర్ఘటన బాధితులు, వారి కుటుంబాలు ఈ స్థలంలో స్థిరపడ్డాయి. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉంటూ గ్యాస్ దుర్ఘటనలో నష్టపోయిన ప్రజలకు నష్టపరిహారం అందించేందుకు ఆయన ఎంతో కృషి చేశారు. భోపాల్ నార్త్ సీటులో దాదాపు 54 శాతం ముస్లిం ఓట్లు ఉన్నాయి. అయితే సింధీ కమ్యూనిటీకి చెందిన ఓటర్లు కూడా మంచి సంఖ్యలో ఉన్నారు. ప్రతిసారి వీరు ఆయన మద్దతుగా నిలిచి గెలిపించారు. ఆరిఫ్ నగర్ లో గ్యాస్ దుర్ఘటన బాధితులు నివసిస్తుంటారు. అది పెద్ద మురికి వాడగా చెబుతారు. అక్కడ సరైన వసతులు కల్పించాలని ఆరిఫ్ నిరంతరం కొట్లాడుతూ.. వచ్చారు. ఆయన మరణవార్తతో ఆరిఫ్ నగర్ మూగబోయింది.