Big Breaking: సీనియర్ నటుడు చలపతిరావు అలియాస్ తమ్మారెడ్డి చలపతిరావు(78)కన్నుమూశారు. తెల్లవారుజామున ఆయన గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఇతను పన్నెండు వందల పైగా సినిమాల్లో పలు రకాల పాత్రల్లో నటించాడు. కొంతకాలంగా నటనకు దూరంగా ఉంటున్నారు చలపతిరావు. ఆయన 1944మే 8న జన్మించారు. చలపతిరావు స్వస్థలం కృష్ణాజిల్లా పామర్రు మండలంలోని బల్లిపర్రు. నాన్న పేరు మణియ్య. అమ్మ వియ్యమ్మది పక్కనే ఉన్న మామిళ్లపల్లి .ఆయనకు ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి. ఆడపిల్లలు అమెరికాలో ఉంటారు. కుమారుడు రవిబాబు నటుడిగా, దర్శకుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో రాణిస్తున్నారు. చలపతిరావు నటించిన మొదటి చిత్రం గూఢచారి 116, చివరి చిత్రం ఓ మనిషి నీవెవరు. రెండు రోజలు క్రితమే సీనియర్ నటుడు కైకాల కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే మరో నటుడిని కోల్పోవడంతో టాలీవుడ్ విషాదంలో మునిగిపోయింది. చలపతిరావు మృతిపై సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. విలక్షణ నటుడిగా చలపతిరావు మంచి గుర్తింపు ఉంది. విలన్‌గా, తండ్రిగా, అన్నగా వివిధ పాత్రలో నటించి మెప్పించారు చలపతిరావు.
Big Breaking: సీనియర్ నటుడు చలపతిరావు కన్నుమూత

Chalapati Rao