వరల్డ్ కప్ 2023లో భాగంగా.. ఈరోజు సౌతాఫ్రికా-ఆస్ట్రేలియా మధ్య రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా.. మొదటగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్ కు దిగిన సౌతాఫ్రికా జట్టుకు ఆరంభంలోనే కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. ఆసీస్ బౌలింగ్ దాటికి టాప్ ఆర్డర్ విఫలమైంది. దీంతో 4 వికెట్లు కోల్పోయింది సౌతాఫ్రికా.
Read Also: China: చైనాలో ఘోర అగ్నిప్రమాదం.. 26 మంది దుర్మరణం
ఇదిలా ఉంటే.. సౌతాఫ్రికా-ఆస్ట్రేలియా మ్యాచ్ కు వరుణుడు అడ్డంకి తగిలాడు. ముందుగానే వాతావరణ సంస్థలు చెప్పిన విధంగా ఎంట్రీ ఇచ్చాడు. మ్యాచ్ ప్రారంభమైన గంటకే వర్షం పడింది. దీంతో మ్యాచ్ నిలిచిపోయింది. వర్షం వల్ల మ్యాచ్ ఆగిపోయే సమయానికి దక్షిణాప్రికా 14 ఓవర్లలో 44 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఇక.. క్రీజులో మిడిలార్డర్ బ్యాట్స్ మెన్ హెన్రిచ్ క్లాసెన్ (10), డేవిడ్ మిల్లర్ (10) ఉన్నారు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్ 2, హేజెల్ వుడ్ 2 వికెట్లు తీశారు.
పిచ్ పై కాస్త తేమ ఉండడం, స్వింగ్ లభించడంతో ఆసీస్ పేసర్లు పదునైన బంతులతో విరుచుకుపడ్డారు. దీంతో తొలి పవర్ ప్లేలోనే ఓపెనర్ల వికెట్లు కోల్పోగా… ఆ తర్వాత మరో రెండు వికెట్లు పడిపోయి సౌతాఫ్రికా కష్టాల్లో పడింది.