Saurav Das: ‘‘ఢిల్లీలో ఉంటున్నట్లు ఆధారాలేవి?’’ CJP నేతకు కోర్టు ఆదేశం
- CJP నేత సౌరవ్ దాస్‌కు కోర్టు కీలక ఆదేశం..
- ఢిల్లీలో నివాస రుజువు సమర్పించాలన్న కోర్టు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Saurav Das: కాక్రోచ్ జనతా పార్టీ (CJP) కో-కన్వీనర్ సౌరవ్ దాస్‌కు స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్(SEM) కోర్టులో చుక్కెదురైంది. ‘‘శాంతి ఒప్పందం’’ దాఖలు ప్రక్రియ సందర్బంగా ఢిల్లీలో సౌరవ్ దాస్ నివాసానికి సంబంధించిన రుజువుల్ని సమర్పించాలని కోర్టు ఆదేశించింది. సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలు కొన్ని రోజుల క్రితం షరతులతో కూడిన బెయిల్‌పై విడుదలయ్యారు. అక్టోబర్ 10న వీరిద్దరు సంతకం చేసిన పీస్ బాండ్‌ను ఉల్లంఘించి, ఆంక్షలు ఉన్నప్పటికీ జంతర్ మంతర్ వద్దకు వెళ్లి నిరసన తెలిపారు. అక్టోబర్ 13న వీరిద్దర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోర్టు వీరిద్దరికి జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. 7 రోజుల తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారు.
ఈ నేపథ్యంలో ఢిల్లీలో సౌరవ్ దాస్ నివాసానికి సంబంధించిన రుజువుల్ని కోర్టు కోరింది. శనివారం జరిగిన కోర్టు విచారణల్లో అద్దె ఒప్పందం, దస్తావేజు లేదా లీజుకు సంబంధించిన ఎలాంటి పత్రాలను కూడా సౌరవ్ దాస్ సమర్పించలేదని కోర్టు గుర్తించింది. దాస్, రాంకాలు ఇద్దరు తమ పూచీదారులతో కలిసి శనివారం కోర్టు ముందు హాజరయ్యారు. పత్రాల పరిశీలన కోసం కోర్టు ఈ కేసును నవంబర్ 17కు వాయిదా వేసింది.
Also Read
- El Nino: ఎల్‌నినో రికార్డ్.. తొలిసారిగా 30°Cకు చేరిన ఉష్ణోగ్రతలు..
- Sonia Gandhi Love story: రాజీవ్ గాంధీతో మొదటి చూపులోనే ప్రేమ.. తమ లవ్‌స్టోరీపై సోనియా గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు..
- Railway Group D Recruitment 2026: నిరుద్యోగులకు రైల్వే శాఖ శుభవార్త.. 30 వేల పోస్టులతో నోటిఫికేషన్..!
- Rahul Gandhi: పండుగల సమయం.. ర్యాలీ వాయిదా వేయండి.. రాహుల్‌గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
ఇదిలా ఉంటే, నిరసనలకు సంబంధించిన కేసులో మరో నిందితురాలుగా ఉన్న ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్(AISA) నేత నేహా బోరాకు ఢిల్లీ హైకోర్టులో ఉపశమనం లభించలేదు. SEM కోర్టు ‘‘పీస్ బాండ్’’ పై సంతకం చేయాలని ఆదేశించిన ఉత్తర్వుల్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. దీని తర్వాత, తాను కోర్టులో శాంతి ఒప్పందం దాఖలు చేయనని స్పష్టం చేసింది. ఈ దేశంలో నిరసనల్ని అణచివేయడానికి ‘‘శాంతి ఒప్పందాన్ని’’ ఉపయోగించవచ్చని ఆమె ఆరోపించారు.
తాజావార్తలు
-
Saurav Das: ‘‘ఢిల్లీలో ఉంటున్నట్లు ఆధారాలేవి?’’ CJP నేతకు కోర్టు ఆదేశం
-
Upasana : ఒక ఆడదాని కన్నీళ్లు ఇంకో ఆడదానికి విజయం కాకూడదు.. ఉపాసన సంచలన వ్యాఖ్యలు!
-
Uttam Kumar Reddy : కాళేశ్వరం పునరుద్ధరణకు ఆర్మీ ఇంజనీర్.. బీఆర్ఎస్ తీరుపై మంత్రి ఉత్తమ్ ఫైర్
-
Adarsha Kutumbam : పేరేమో ఆదర్శ కుటుంబం.. కానీ చిన్న సినిమాలకు హారర్ కుటుంబం!
-
El Nino: ఎల్‌నినో రికార్డ్.. తొలిసారిగా 30°Cకు చేరిన ఉష్ణోగ్రతలు..
ట్రెండింగ్
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!