Site icon NTV Telugu

Sejal : ఫిర్యాదు చేయడానికి వస్తే ఎవరూ పట్టించుకోవడం లేదు

Sejal

Sejal

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య చేతిలో ఆర్థికంగా మోస పోయామని ఆరిజన్ డైరీ బాధితురాలు శేజల్‌ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. సెంట్రల్ ఉమెన్ కమిషన్ కు గతంలో ఫిర్యాదు చేశానని, నాకు జరిగిన అన్యాయం పై వివరిస్తూ ఫిర్యాదు చేశానని తెలిపారు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బాధితురాలు శేజల్‌. ఇవాళ ఆమె ఎన్టీవీతో మాట్లాడుతూ.. కమిషన్ తాను నివాసం ఉండే స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయమన్నారు.

Also Read : Keerthy Suresh Pics: వెరైటీ స్లీవ్ లెస్ డ్రెస్‌లో కీర్తి సురేష్.. చూపులతోనే చంపేస్తుంది!

సంబంధిత పోలీస్ సిబ్బందికి తాము చెబుతామని చెప్పారని, కమిషన్ ఆదేశాలతో రాయదుర్గం పోలీస్ స్టేషన్ కు వచ్చాననన్నారు. నాకు జరిగిన అన్యాయం పై ఫిర్యాదు చేయడానికి వస్తే ఎవరూ పట్టించుకోవడం లేదని, కనీసం కంప్లైంట్ కూడా తీసుకోవడం లేదన్నారు. గత వారం రోజులుగా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నానని, ఏదో ఒక కారణం చెబుతున్నారు స్టేషన్ సిబ్బంది అని ఆమె మండిపడ్డారు. సెంట్రల్ ఉమెన్ కమిషన్ చెప్పిన రాయదుర్గం పోలీసులు కంప్లైంట్ తీసుకోవడం లేదని, నా పై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేశారన్నారు. నా క్యారెక్టర్ ను దిగజార్చారని, అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. నేను ఒక యువతిని ఎన్నిసార్లని స్టేషన్ చుట్టూ తిరగాలని ఆమె ప్రశ్నించారు.

Also Read : Bihar: ఇదేం ఖర్మ రా బాబు.. మేనల్లుడితో అత్త జంప్.. నాలుగు నెలల తర్వాత

నా పై మంత్రి కేటీఆర్ కు తప్పుడు సమాచారం ఇచ్చారు, ఆయన అలా మాట్లాడాల్సింది కాదని, ఆత్మహత్య చేసుకోవడం నాకేమి ఆనందం కాదన్నారు. నన్ను నా కుటుంబాన్ని మానసికంగా వేధిస్తున్నారని, నాకు న్యాయం జరగాలని, రాయదుర్గం పోలీసులు కంప్లైంట్ తీసుకోవడం లేదన్న విషయాన్ని మహిళా కమిషన్ దృష్టికి తీసుకెళ్తానన్నారు శేజల్‌.

Exit mobile version