టీమిండిమా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ట్విట్టర్ యాక్టివ్ గా ఉంటాడు.. క్రికెట్ కు గుడ్ బై చెప్పిన తర్వాత సోషల్ మీడియాలో సెహ్వాగ్ బాగా యాక్టివైపోయాడు. సెటైర్లు, పంచ్ లు వేయడంతో పాటు వెరైటీగా కామెంట్స్ చేయడంలోనూ వీరూ రూటే సెపరేటు. తాజాగా మహేంద్ర సింగ్ ధోనికి పుట్టినరోజు సందర్భంగా వెరైటీగా విషస్ చెప్పాడు. ఇవాళ టీమిండియా మాజీ సారథి ఎంఎస్ ధోని 42వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా ధోనికి శుభాకాంక్షలు తెలుపుతూ ట్విటర్ లో విభిన్నంగా పోస్ట్ పెట్టాడు.
Read Also: Rat In Rain: అమ్మయ్య ఎన్నాళ్లయిందో స్నానం చేసి.. సబ్బు ఉంటే బాగుండు..
సెహ్వాగ్.. సూర్య భగవానుడి గుర్రాలు 7, రుగ్వేదంలోని భాగాలు 7, రుతువులు 7, కోటలు 7, సంగీత స్వరాలు 7, పెళ్లిలో వేసే అడుగులు 7, ప్రపంచంలోని అద్భుతాలు 7.. 7వ నెలలోని 7వ తేదీన గొప్ప వ్యక్తి పుట్టినరోజు @msధోని అంటూ ట్వీట్ చేశాడు. ధోనితో కలిసివున్న ఫోటోలను తన ట్వీట్ కు అటాచ్ చేశాడు. వీరేంద్ర సెహ్వాగ్ చేసిన ట్వీట్ పై నెటిజనులు కూడా రియాక్ట్ అవుతున్నారు. ధోని జెర్సీ నంబరు కూడా 7 అని వాళ్లు గుర్తు చేశారు. 2011 వన్డే ప్రపంచకప్ లో రివ్యూకు మీరు తీసుకున్న సమయం 7 సెకన్లు అని మరొకొందరు కామెంట్ చేశారు. MS DHONI పేరులో కూడా ఏడు అక్షరాలు ఉన్నాయని పలువురు నెటిజన్స్ వెల్లడించారు.
Read Also: CV Anand: హెర్బల్ ప్రోడక్ట్స్ పేరుతో 7 వేల మందికి టోకరా.. రూ.200 కోట్లు ఢమాల్
ఇంద్రధనస్సులో ఏడు రంగులను మీరు మిసయ్యారని సెహ్వాగ్ కు క్రికెట్ అభిమానులు గుర్తు చేశారు. అయితే మనం ఫాలో అయ్యే రుతువులు 6 మాత్రమేనని నెటిజన్స్ క్లారిటీ ఇచ్చారు. విభిన్నంగా శుభాకాంక్షలు చెప్పిన సెహ్వాగ్ ను మహేంద్ర సింగ్ ధోని అభిమానులు ప్రశంసిస్తూ కామెంట్లు పెడుతున్నారు. కాగా, ఎంఎస్ ధోనికి మాజీ క్రికెటర్లు, ప్రెసెంట్ ఆటగాళ్లతో పాటు ఐపీఎల్ ఫ్రాంచైజీలు కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలిపాయి.
