Seethamraju Sudhakar: వైసీపీలో వన్‌సైడ్ లవ్.. భరించలేక గుడ్‌బై..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Seethamraju Sudhakar: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరోనేత గుడ్‌బై చెప్పారు.. వైసీపీలో వన్ సైడ్ లవ్ భరించలేక పార్టీ మారాలని నిర్ణయించుకున్నాను అని తెలిపారు విశాఖ.. బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సీతంరాజు సుధాకర్.. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టినా పార్టీలో ముఖ్యనాయకులకు జరిగిన అవమానమే.. నాకు ఎదురైందని ఆవేదన వ్యక్తం చేశారు.. అందుకే వైసీపీకి గుడ్‌బై చెబుతున్నట్టు వెల్లడించారు. ఇక, గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ)లో సగం మంది కార్పొరేటర్లు వైసీపీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది చీలిక కాదు పార్టీలో పరిస్థితులపై ఎదురౌతున్న వ్యతిరేకతగా అభివర్ణించారు. విశాఖలో వైసీపీని ఖాళీ చేయడమే లక్ష్యంగా పని చేస్తానని ప్రకటించారు. ఇప్పటికే పార్టీ వీడిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ ఇదే విషయం చెప్పారన్నారు. విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గ మత్స్యకార, ఎస్సీ ముఖ్య నాయకత్వం సూచనలకు అనుగుణంగా త్వరలోనే భవిష్యత్ రాజకీయాలపై నిర్ణయం తీసుకుంటానని అని ప్రకటించారు బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సీతంరాజు సుధాకర్.
Read Also: V. Hanumantha Rao: రాముడికి కాంగ్రెస్ వ్యతిరేకం కాదు.. వీలైనప్పుడల్లా అయోధ్యను సందర్శిస్తాం
Also Read
- Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్‌రెడ్డి ఫైర్
కాగా, విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గానికి చెందిన సీతంరాజు సుధాకర్.. గత డిసెంబర్లోనే వైసీపీకి రాజీనామా చేశారు.. విశాఖ దక్షిణ నియోజకవర్గ ఇన్చార్జిగా పనిచేసిన సుధాకర్‌కు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌తో విభేదాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు ఈ విషయాలను పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి దృష్టికి తీసుకెళ్లినా న్యాయం జరగలేదు.. మద్దతుదారులు ఫిర్యాదులు చేసినప్పటికీ ఎటువంటి ఫలితం కనిపించలేదని.. అందుకే పార్టీని విడిచిపెట్టినట్లు చెప్పారు. సుధాకర్.. ముఖ్యమంత్రి వైఎస్‌కు లేఖ రాశారు. తన పదవితో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.. అయితే, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖపట్నం సౌత్ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా వాసుపల్లి గణేష్ కుమార్ విజయం సాధించారు. ఆ తర్వాత వైఎస్సార్సీపీలోకి మారారు. ఇటీవల గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కు చెందిన కొందరు కార్పొరేటర్లు వాసుపల్లికి వ్యతిరేకంగా పలుమార్లు సమావేశాలు నిర్వహించారు. అయితే, కార్పొరేటర్ల నుండి వ్యతిరేకత ఉన్నప్పటికీ, సౌత్ సీటును గెలవగలరని సీఎంను ఒప్పించడంలో వాసుపల్లి విజయం సాధించారని ఎమ్మెల్యే మద్దతుదారులు అంటున్నారు. ఈ నేపథ్యంలో సీతంరాజు సుధాకర్ రాజీనామా చేశారు. ఇటీవలే ఎమ్మెల్సీ వంశీకృష్ణ.. వైఎస్సార్సీపీని వీడి జనసేనలో చేరిన విషయం విదితమే..
తాజావార్తలు
-
Rao Bahadur Teaser: ఈసారి సత్యదేవ్ కొట్టేలా ఉన్నాడు.. ‘రావు బహదూర్’ టీజర్ డేట్ ఫిక్స్.. రిలీజ్ డేట్ అప్పుడే!
-
Nandini Reddy: ‘పెద్ది’ వివాదంపై నందిని రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. బుచ్చిబాబు తప్పు ఒప్పుకున్నాడు!
-
Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
-
Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
-
PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!