NTV Telugu Site icon

Seethamraju Sudhakar: వైసీపీలో వన్‌సైడ్‌ లవ్‌.. భరించలేక గుడ్‌బై..!

Seethamraju Sudhakar

Seethamraju Sudhakar

Seethamraju Sudhakar: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి మరోనేత గుడ్‌బై చెప్పారు.. వైసీపీలో వన్ సైడ్ లవ్ భరించలేక పార్టీ మారాలని నిర్ణయించుకున్నాను అని తెలిపారు విశాఖ.. బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సీతంరాజు సుధాకర్.. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టినా పార్టీలో ముఖ్యనాయకులకు జరిగిన అవమానమే.. నాకు ఎదురైందని ఆవేదన వ్యక్తం చేశారు.. అందుకే వైసీపీకి గుడ్‌బై చెబుతున్నట్టు వెల్లడించారు. ఇక, గ్రేటర్‌ విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ)లో సగం మంది కార్పొరేటర్లు వైసీపీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది చీలిక కాదు పార్టీలో పరిస్థితులపై ఎదురౌతున్న వ్యతిరేకతగా అభివర్ణించారు. విశాఖలో వైసీపీని ఖాళీ చేయడమే లక్ష్యంగా పని చేస్తానని ప్రకటించారు. ఇప్పటికే పార్టీ వీడిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ ఇదే విషయం చెప్పారన్నారు. విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గ మత్స్యకార, ఎస్సీ ముఖ్య నాయకత్వం సూచనలకు అనుగుణంగా త్వరలోనే భవిష్యత్‌ రాజకీయాలపై నిర్ణయం తీసుకుంటానని అని ప్రకటించారు బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సీతంరాజు సుధాకర్.

Read Also: V. Hanumantha Rao: రాముడికి కాంగ్రెస్ వ్యతిరేకం కాదు.. వీలైనప్పుడల్లా అయోధ్యను సందర్శిస్తాం

కాగా, విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గానికి చెందిన సీతంరాజు సుధాకర్.. గత డిసెంబర్‌లోనే వైసీపీకి రాజీనామా చేశారు.. విశాఖ దక్షిణ నియోజకవర్గ ఇన్‌చార్జిగా పనిచేసిన సుధాకర్‌కు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌తో విభేదాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు ఈ విషయాలను పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి దృష్టికి తీసుకెళ్లినా న్యాయం జరగలేదు.. మద్దతుదారులు ఫిర్యాదులు చేసినప్పటికీ ఎటువంటి ఫలితం కనిపించలేదని.. అందుకే పార్టీని విడిచిపెట్టినట్లు చెప్పారు. సుధాకర్.. ముఖ్యమంత్రి వైఎస్‌కు లేఖ రాశారు. తన పదవితో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.. అయితే, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖపట్నం సౌత్ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా వాసుపల్లి గణేష్ కుమార్ విజయం సాధించారు. ఆ తర్వాత వైఎస్సార్‌సీపీలోకి మారారు. ఇటీవల గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కు చెందిన కొందరు కార్పొరేటర్లు వాసుపల్లికి వ్యతిరేకంగా పలుమార్లు సమావేశాలు నిర్వహించారు. అయితే, కార్పొరేటర్ల నుండి వ్యతిరేకత ఉన్నప్పటికీ, సౌత్ సీటును గెలవగలరని సీఎంను ఒప్పించడంలో వాసుపల్లి విజయం సాధించారని ఎమ్మెల్యే మద్దతుదారులు అంటున్నారు. ఈ నేపథ్యంలో సీతంరాజు సుధాకర్ రాజీనామా చేశారు. ఇటీవలే ఎమ్మెల్సీ వంశీకృష్ణ.. వైఎస్సార్‌సీపీని వీడి జనసేనలో చేరిన విషయం విదితమే..