Site icon NTV Telugu

Manish Sisodia: 103 రోజుల తర్వాత తన భర్తను కలుసుకున్న మనీష్ సిసోడియా భార్య.. భావోద్వేగ లేఖ విడుదల చేసిన సీమా సిసోడియా

Manish

Manish

Manish Sisodia: ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా భార్య సీమా సిసోడియా 103 రోజుల తర్వాత తన భర్తను కలిసింది. మనీష్ సిసోడియా ఆరోగ్యం క్షీణిస్తున్న దృష్ట్యా తన జీవిత భాగస్వామిని కలవడానికి ఢిల్లీ హైకోర్టు అనుమతించింది. దాదాపు 7 గంటల పాటు వాళ్లిద్దరూ కలిసి ఉన్నారు. ఆ తర్వాత ఆమే భావోద్వేగానికి గురయ్యారు.

Read Also: GPS vs CPS: సీపీఎస్ వర్సెస్ జీపీఎస్.. ఏపీలో ఇదే హాట్ టాపిక్..!

మరోవైపు మనీష్ సిసోడియా భార్య సీమా సిసోడియా ఓ బహిరంగ లేఖను విడుదల చేశారు. సీమా సిసోడియా తన నివాసంలోనే ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. 103 రోజుల తర్వాత తన భర్తను కలుసుకున్నానంటూ ఆమె ఆ లేఖలో పేర్కొన్నారు. ఇంతకాలం తరువాత తాము కలుసుకుంటే మనీష్ కార్యక్రమాలపై నిఘా కోసం తమ బెడ్‌రూమ్ ప్రవేశద్వారం వద్ద పోలీసులు కాపలాగా ఉన్నారని, రాజకీయాలను మురికితో పోల్చింది అందుకేనని వాపోయారు. రాజకీయాల్లోకి వెళ్లవద్దని తన బంధువులు, శ్రేయాభిలాషులు మనీష్‌కు సలహా ఇచ్చిన విషయాన్ని ఆమె ఈ సందర్భంగా గుర్తుకు చేసుకున్నారు. రాజకీయాలపై మక్కువ ఉన్నప్పటికీ మనీష్ జర్నలిస్టు వృత్తిని ఎంచుకున్నారని, ప్రస్తుత ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తో కలిసి పార్టీ ఏర్పాటు చేశారని అన్నారు.

Read Also: Uttarapradesh : అమానుషం..అత్యాచారానికి గురైన 12 ఏళ్ల బాలిక మృతి..

జైలులో తన భర్త పడుతున్న కష్టాల గురించి సీమా సిసోడియా మాట్లాడుతూ, “ఈ రోజు మనీష్ ముఖంలో అచంచలమైన దృఢ నిశ్చయాన్ని చూశానని.. అది అతని మాటలలో స్పష్టంగా కనిపిస్తుంది. అని తెలిపింది.
నేను, నా భర్త, కుటుంబ సభ్యులు ఇంకెన్నాళ్లు ఇలాంటి కుట్రలు ఎదుర్కోవాలో అంటూ వాపోయారు. రాజకీయాలను అందుకే మురికితో పోల్చారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. చదువు కోసం అరవింద్, మనీష్ కన్న కలలను మాత్రం కటకటాల వెనక్కి నెట్టలేరు. కచ్చితంగా పాలిటిక్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ గెలిచి తీరుతుంది. మనీష్ నిన్ను చూసి గర్విస్తున్నా…అంటూ ఆ లేఖలో వివరించారు.

Read Also: Odisha: గూడ్స్ ట్రైన్ కింద తలదాచుకుందామని వెళ్తే.. చక్రాల కిందపడి ఆరుగురు మృతి

మరోవైపు భార్యను కలుసుకునేందుకు మనీష్ సిసోడియాకు కోర్టు షరతులు విధించింది. తీహార్ జైలులో ఉంటున్న సిసోడియా.. ఆయన బెయిల్ దరఖాస్తును కోర్టు పలుమార్లు తోసిపుచ్చింది. అస్వస్ధతతో ఉన్న సీమ సిసోడియాను కలుసుకునేందుకు కొన్ని షరతులతో అంగీకరించింది. పోలీసుల సమక్షంలో ఇంటి వద్ద కానీ, ఆసుపత్రిలో కానీ ఉదయం 10 గంటల నుండి 5 గంటల లోపు ఒకరోజు ఆమెను కలుసుకోవచ్చని తెలిపింది. ఆ సమయంలో ఆయన కుటుంబ సభ్యులతో మినహా ఎవరితో మాట్లాడరాదని, మీడియా ముందుకు వెళ్లరాదని, ఫోను, ఇంటర్నెట్‌ను ఉపయోగించరాదని షరతులు పెట్టింది.

Exit mobile version