NTV Telugu Site icon

Seema Haider: అయోధ్య వరకు సీమా హైదర్ పాదయాత్ర.. సీఎం యోగికి అభ్యర్థన..

Seema Haider

Seema Haider

Uttar Pradesh: అయోధ్యలో కొలువైన రామ్‌లల్లాను దర్శించేందుకు సీమా హైదర్ పాదయాత్ర చేసేందుకు రెడీ ఉన్నట్లు ప్రకటించింది. ఇందు కోసం ఆమె ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పర్మిషన్ కోసం దరఖాస్తు చేసుకుంది. యూపీకి చెందిన సచిన్‌పై ప్రేమతో పాకిస్థాన్‌ నుంచి భారత్‌కు వలస వచ్చిన సీమా హైదర్‌ తాను కృష్ణుడి భక్తురాలి అని చెప్పుకొచ్చింది. నిన్న (ఫిబ్రవరి 14న) ఆమె సుందరకాండ పఠిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. తాను పూర్తి హిందువుగా మారినట్లు సీమా హైదర్ వెల్లడించింది. పాకిస్థాన్‌లో ఉన్నప్పడు కూడా తాను హిందువుల పండుగలను రహస్యంగా జరుపుకునేదానినని అని తెలిపింది.

Read Also: TS Polycet 2024: తెలంగాణ పాలిసెట్ నోటిఫికేషన్ విడుదల.. ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ

కాగా, సీమాహైదర్‌కు సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. అయితే, సీమా హైదర్ తన నలుగురు పిల్లలతో నేపాల్ మీదుగా భారత్ లోకి అక్రమంగా తరలివచ్చింది. ఆమె ప్రస్తుతం నోయిడాలో సచిన్‌తో కలిసి జీవనం కొనసాగిస్తుంది. తాను కాలినడకన అయోధ్యకు వెళ్లాలనుకుంటున్నాను.. ఇందుకోసం యోగి ప్రభుత్వం నుంచి అనుమతి కావాలని సీమా హైదర్‌ కోరింది. ఇక, సీమా హైదర్ భారత పౌరసత్వం కోసం ఆమె తరపు లాయర్‌ ట్రై చేస్తున్నారు.

Read Also: HCL : మూడు రోజుల ఆఫీసుకు రావాల్సిందే.. లేకపోతే చర్యలు తప్పవు

ఇక, సీమ అయోధ్యకు వెళ్లేందుకు చట్టపరమైన ప్రక్రియ త్వరలో పూర్తి కాబోతుందని ఆమె తరపు న్యాయవాది ఏపీ సింగ్ పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు అందరితో కలిసి అయోధ్యలోని రామ్‌లల్లాను దర్శించుకుంటాను అని సీమా హైదర్ మీడియాకు చెప్పింది. గ్రేటర్ నోయిడాలోని రబుపురా గ్రామం నుంచి అయోధ్య వరకు దాదాపు 645 కిలోమీటర్లు పాదయాత్ర చేపట్టేందుకు రెడీగా ఉన్నట్లు ఆమె వెల్లడించింది.