NTV Telugu Site icon

Seema haider: సీమా హైదర్‌పై దాడి.. వీడియో వైరల్

Sim

Sim

ప్రియుడి కోసం భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించి గ్రేటర్ నోయిడాలో సచిన్ మీనాతో కలిసి ఉంటున్న పాకిస్థాన్ జాతీయురాలు సీమా హైదర్‌కు తీవ్రగాయాలయ్యాయి. కన్ను, పెదవి దగ్గర గాయాలయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే దీనిపై రకరకాలైన వ్యాఖ్యానాలు వస్తున్నాయి.

భర్తే దాడి చేశాడంటూ నెటిజన్లు అంటున్నారు. కావాలనే సీమాను భర్త కొట్టాడంటూ సామాజిక మాధ్యమాల్లో కామెంట్లు వస్తున్నాయి. అయితే ఈ వార్తలను సీమా హైదర్ కొట్టిపారేసింది. తన భర్త ఎలాంటి దాడి చేయలేదని.. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఆమె తోసిపుచ్చారు. నెటిజన్ల ఆరోపణలను ఆమె ఖండించారు. కానీ ఆమె కళ్లు, పెదవులు మాత్రం వాపు వచ్చాయి. ఎలా జరిగిందన్న దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.

ఇది కూడా చదవండి: Jr NTR: కాలర్ ఎగరేసుకునేలా దేవర.. డైలాగ్ లీక్ చేసిన ఎన్టీఆర్.. సిద్ధూకి హ్యాట్సాఫ్ చెబుతూ!

పాకిస్థాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లోని జాకోబాబాద్‌కు చెందిన సీమా.. గతేడాది మేలో కరాచీలోని తన ఇంటిని పిల్లలను వదిలి నేపాల్ మీదుగా భారత్‌కు వెచ్చింది. గ్రేటర్ నోయిడాలో భర్త అయిన సచిన్ మీనాతో కలిసి ఉంటుంది. ఈ మధ్య ప్రధాని మోడీ నిర్ణయాలను స్వాగతిస్తూ వస్తోంది. వివాదాస్పద పౌరసత్వ (సవరణ) చట్టం అమలును ప్రశంసించింది. హిందూమతాన్ని స్వీకరించినట్లు చెప్పుకునే హైదర్.. ప్రధాని మోడీ నిర్ణయాన్ని స్వాగతించారు. సీఏఏ ద్వారా ఆమె భారత పౌరసత్వం పొందడానికే ఆమె ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సీమా హైదర్‌కు కలిగిన గాయాల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనిపై పోలీసులు ఏం చెబుతారో చూడాలి.