Site icon NTV Telugu

Viral Video: బస్సులో కునుకు తీస్తూ ఎలా పడిపోయాడో చూడండి..

Sleep

Sleep

ఈ రోజుల్లో ప్రజలు బిజీ బిజీ లైఫ్ ను గడిపేస్తున్నారు. ఆఫీసుల్లో పని, ఇంట్లో సమస్యలతో ఇతరత్రా కారణాలతో తగినంత నిద్ర పోవడంలేదు. నిద్రపోవడానికి సమయం దొరికినా.. ఆ సమయాన్ని మొబైల్ ఫోన్లలోనే గడుపుతున్నారు. అర్థరాత్రి వరకు ఫోన్లను చూస్తూ.. నిద్ర వచ్చిన కూడా అలవాటు పడి సరిగా నిద్రపోవడం లేదు. ఇక ఉదయం హడవిడిగా లేచి.. తయారై ఆఫీసుకో.. లేదంటో ఇంకేదో పనికో వెళ్తున్నప్పుడు తాము వెళ్లే బస్సు, ఆటో, మెట్రోల్లో కునుకు తీస్తున్నారు.

Read Also: Dhanush: ఆమె వలనే నా జీవితం నాశనమైంది.. ధనుష్ సంచలన వ్యాఖ్యలు

ప్రయాణంలో నిద్రపోవడం సర్వసాధారణం. ప్రయాణం చేస్తున్నప్పుడు చాలా మంది పడుకుంటారు. అయితే కొన్నిసార్లు ప్రయాణిస్తున్నప్పుడు నిద్రపోవడం ప్రమాదకరం. దీంతో చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. ఇలాంటి సంఘటనలు ఎన్ని జరిగినా.. జనాలు ఆ విధానాన్ని ఆపడం లేదు. అయితే బస్సులో ఓ వ్యక్తి నిద్రపోతూ ఆకస్మాత్తుగా ఎలా కిందపడిపోయాడో ఈ వీడియోలో చూడొచ్చు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Read Also: Lalu Prasad Yadav: వేపపుల్లలో ఇండియా, భారత్‌ల మధ్య తేడాను వివరించిన లాలూ.. ఓల్డ్ వీడియో వైరల్..

బస్సులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి గాఢ నిద్రలోకి వెళ్ళాడు. అయితే అతని తల ఒక వైపుకు వణుకుతూ అతను పడిపోతాడు. దీంతో అతను పడిపోవడంతో బస్సులో పెద్ద శబ్దం వచ్చింది. ఇంతలోనే బస్సులో ఉన్న వాళ్లంతా ఏమైదంటూ అతని వైపు చూస్తుంటారు. కిందపడిన ఆ వ్యక్తి లేచి మళ్లీ తన సీట్లోకి వెళ్లి కూర్చుంటాడు. ప్రయాణంలో నిద్రపోవడం ఎంత ప్రమాదకరమో ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. అందుకే ఇలాంటి ప్రమాదాలు ఎదురవకుండా ఉండాలంటే మనిషికి ప్రతిరోజూ 8 గంటల నిద్ర అవసరం.

https://twitter.com/NoContextHumans/status/1698821098811293848

Exit mobile version