Site icon NTV Telugu

Tamil Nadu: తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న సెక్యూరిటీ గార్డు..

Tamil Nadu

Tamil Nadu

తమిళనాడులోని ఆవడి ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌ (IAF)లో సెక్యూరిటీగా పనిచేస్తున్న ఓ వ్యక్తి తన సర్వీస్ వెపన్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు మైలాడుతురై జిల్లా ముట్టపుదుపేట్‌కు చెందిన కాళిదాస్ (55)గా గుర్తించారు. అతనికి భార్య, ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఈ సంఘటన జూలై 24వ తేదీ బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు జరిగింది. కాళిదాస్ వాచ్ టవర్‌లలో ఒకదానిలో విధులు నిర్వహిస్తుండగా, అతను ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు.

Read Also: KTR: జలాశయాల్లో నీరు నింపకపోతే మేమే పంపులు ఆన్ చేస్తాం..

తెల్లవారుజామున 4 గంటలకు భద్రతా సిబ్బందికి తుపాకీ కాల్పుల శబ్దం వినపడింది. దీంతో వారు మేల్కొని చూడగా.. కాళిదాస్ మృతదేహం రక్తపు మడుగులో పడి ఉంది. వెంటనే పోలీసులకు సమాచారం అందించి కాళిదాస్‌ను ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని.. పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం పంపించారు. కాళిదాస్ శరీరంలో మూడు బుల్లెట్ గాయాలున్నట్లు గుర్తించారు. కాళిదాస్‌ ఆత్మహత్యకు గల కారణాలపై ముత్తుపాడుపేట పోలీసులు విచారణ చేపట్టారు.

Read Also: LIC HFL 2024: నిరుద్యోగులకు ఎల్ఐసి శుభవార్త.. భారీగా జీతం..

Exit mobile version