Site icon NTV Telugu

Lift Fight : సాయానికి పోతే పాపం ఎదురైందంట.. ఇదే మరీ..!

Security Guard

Security Guard

ఉపకారికి ఉపకారం చేయకపోయినా.. అపకారం మాత్రం చేయవద్దని మనం చిన్నప్పటి నుంచి వినే ఉంటాం. ఆపదలో ఉన్న వ్యక్తి సహాయం చేస్తే.. తిరిగి ప్రత్యుపకారం చేసేవారిని ఎంతో మందిని చూసే ఉంటాం. అయితే ఇక్కడ ఆపదలో ఉన్న వ్యక్తిని రక్షిస్తే.. రక్షించినవారిపైనే దాడి చేశాడో వ్యక్తి. ఈ ఘటన హర్యానాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హర్యానాలో గురుగ్రామ్‌లోని ది క్లోజ్ నార్త్ అపార్ట్‌మెంట్స్‌లోని నివాసం ఉంటున్న వ్యక్తి సోమవారం రోజున అపార్ట్‌మెంట్‌ లిఫ్ట్‌లో కింది వస్తుంటే.. లిఫ్ట్‌ మధ్యలోనే ఆగిపోయింది. దీంతో ఇది గమనించిన సెక్యూరిటీ గార్డ్‌ అశోక్‌ కుమార్ వెంటనే మరో సెక్యూరిటీ వ్యక్తితో కలిసి ఆ లిఫ్ట్‌ను ఓపెన్‌ చేశారు. అయితే.. ఆ లిఫ్ట్‌లో ఇరుక్కున్న వ్యక్తి బయటకు వచ్చి.. సహాయం చేసినందుకు కృతజ్ఞతలు చెబుతాడనుకుంటే.. చెప్పలు పగిలేలా సెక్యూరిటీ గార్డ్‌ అశోక్‌ కుమార్‌పై దాడి చేశాడు.

 

అశోక్‌పైనే కాకుండా అతడికి సాయం చేసిన మరో సెక్యూరిటీ గార్డ్‌పై కూడా దాడి చేయడం గమనార్హం. ఈ తతంగం అంతా.. అపార్ట్‌మెంట్‌లోని సీసీ కెమెరాల్లో రికార్డ్‌ అయ్యింది. దీంతో.. సెక్యూరుటీ గార్డ్‌ అశోక్‌ కుమార్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. సదరు వ్యక్తిపై కేసు నమోదు చేశారు పోలీసులు. సెక్యూరిటీ గార్డ్‌ అశోక్‌ కుమార్‌ మాట్లాడుతూ.. లిఫ్ట్‌లో ఇరుకున్న తనని కేవలం 3-4 నిమిషాల్లో బయటకు తీశామని, లిఫ్ట్‌ నుంచి బయటకు వచ్చిన వెంటనే మాపై దాడి చేయడం ప్రారంభించాడని ఆవేదన వ్యక్తం చేశాడు.

Exit mobile version