NTV Telugu Site icon

RN Ravi: భారతదేశంలో ‘సెక్యులరిజం’ అవసరం లేదు- తమిళనాడు గవర్నర్..

Rn Ravi

Rn Ravi

లౌకికవాదం పేరుతో భారతదేశ ప్రజలకు “మోసం” జరిగిందని తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి ఆరోపించారు. సెక్యులరిజం యూరోపియన్ భావన.. అది భారతదేశంలో అవసరం లేదని తమిళనాడు గవర్నర్ పేర్కొన్నారు. ఆదివారం కన్యాకుమారిలో జరిగిన ఓ కార్యక్రమంలో గవర్నర్ ప్రసంగిస్తూ.. ‘‘ఈ దేశ ప్రజలపై ఎన్నో మోసాలు జరిగాయి, వాటిలో ఒకటి లౌకికవాదానికి తప్పుడు భాష్యం, లౌకికవాదం అంటే ఏమిటి? లౌకికవాదం అనేది యూరోపియన్ భావన. భారతీయ భావన కాదు.” అని ఆర్ఎన్ రవి తెలిపారు

Read Also: Stree 2: ఖాన్‌లు టచ్ చేయలేని విధంగా ‘స్త్రీ 2’ రికార్డ్..

గవర్నర్ ఆర్ఎన్ రవి మాట్లాడుతూ.. ఐరోపాలో చర్చికి, రాజుకు మధ్య జరిగిన ఘర్షణ వల్ల సెక్యులరిజం తలెత్తిందని వివరించారు. స్వాతంత్య్రం వచ్చినప్పుడు రాజ్యాంగాన్ని రూపొందించే సమయంలో ఎవరు సెక్యులరిజం గురించి చర్చించారని ఆయన ప్రశ్నించారు. కానీ భారత్ ధర్మానికి దగ్గరగా ఉంటుంది. ఇక్కడ వైరుధ్యాలు ఉండవు.. కాబట్టి సెక్యులరిజాన్ని ఐరోపాలోనే ఉండనివ్వండని గవర్నర్ వ్యాఖ్యానించారు.

Read Also: Fastest Fifty In Test: టెస్టు క్రికెట్‌లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ సాధించిన ఆటగాళ్లు వీళ్లే..

1976లో రాజ్యాంగ పీఠికలో “సెక్యులరిజం” అనే పదాన్ని ప్రవేశపెట్టిన మాజీ ప్రధాని ఇందిరా గాంధీని కూడా గవర్నర్ రవి విమర్శించారు. ‘‘ఇరవై అయిదేళ్ల తర్వాత, ఎమర్జెన్సీ కాలంలో అభద్రతా భావంతో ఉన్న ప్రధాని.. కొన్ని వర్గాల ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నంలో రాజ్యాంగంలో లౌకికవాదాన్ని ప్రవేశపెట్టారు’’ అని ఆయన అన్నారు.

Show comments