Site icon NTV Telugu

Odela 2 : ‘ఓదెల 2’ సెకండ్ షెడ్యూల్ ప్రారంభం..గూస్ బంప్స్ తెప్పిస్తున్న వర్కింగ్ వీడియో..

Whatsapp Image 2024 04 26 At 11.45.22 Am

Whatsapp Image 2024 04 26 At 11.45.22 Am

మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తున్న లేటెస్ట్ మూవీ “ఓదెల 2”.. బ్లాక్ బస్టర్‌ మూవీ ఓదెల రైల్వే స్టేషన్ మూవీకి కొనసాగింపుగా “ఓదెల 2” మూవీ తెరకెక్కుతుంది.ఓదెల రైల్వే స్టేషన్ సినిమాలో హెబ్బా పటేల్ నటించగా ఆ సినిమా సూపర్ హిట్ అయింది..ఇప్పుడు వస్తున్న ఓదెల 2 లో మిల్కీ బ్యూటీ తమన్నాలీడ్ రోల్ లో నటిస్తుంది.అయితే మహాశివరాత్రి సందర్భంగా ఓం నమ: శివాయ అంటూ ఈ మూవీ నుంచి తమన్నా స్పెషల్‌ లుక్‌ మేకర్స్ షేర్ చేసారు..తమన్నా”శివ శక్తి “లుక్‌ నెట్టింట వైరల్ అవుతుంది. ఓదెల 2లో తమన్నా మహదేవ్‌కు పరమభక్తురాలిగా అలాగే ఓదెల సద్గుణ రక్షకురాలిగా కనిపించబోతుందని మేకర్స్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు.

ఇదిలా ఉంటే ఈ మూవీ మేకర్స్ తాజాగా ఓ ఆసక్తికరమయిన అప్డేట్ ఇచ్చారు. ఓదెల 2 మూవీ రెండవ షెడ్యూల్ ప్రారంభం అయినట్లుగా మేకర్స్ వర్కింగ్ వీడియోను విడుదల చేసారు..ఈ వర్కింగ్ వీడియో గూస్‌బంప్స్‌ తెప్పిస్తుంది.ఓదెల 2 సినిమాను డైరెక్టర్ సంపత్ నంది గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. అశోక్‌ తేజ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో వశిష్ఠ ఎన్‌ సింహా మరియు హరిప్రియ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని సంపత్‌ నంది టీమ్‌ వర్క్స్‌ బ్యానర్‌ మరియు మధు క్రియేషన్స్‌పై తెరకెక్కిస్తున్నారు.ఓదెల 2 మూవీకి కాంతార ఫేమ్ అజనీష్‌ లోక్‌నాథ్‌ మ్యూజిక్ మరియు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తుండటంతో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగాయి . ఓదెల 2 షూటింగ్‌ మార్చిలో ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం కాశీలో ప్రారంభమైంది.మొదటి విడత చిత్రీకరణ పూర్తవడంతో, రెండవ షూట్ షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాదు మరియు చుట్టుపక్కల ప్రాంతాలలో జరుగనుంది .20-25 రోజుల పాటు ఈ షెడ్యూల్ చేయబడింది, ఈ షెడ్యూల్ లో కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.

Exit mobile version