NTV Telugu Site icon

Sea Food Festival: విజయవాడలో ఈ నెల 28 నుంచి 30 వరకు సీ ఫుడ్ ఫెస్టివల్

Sea Food Festival

Sea Food Festival

Sea Food Festival: ఏపీ అంటే ఆక్వా హబ్ అని.. ఏటా సగటున ఒక వ్యక్తి 8 కేజీల ఫిష్ వినియోగిస్తున్నారని ఏపీ మత్స్యశాఖ కమిషనర్ కన్నబాబు అన్నారు. ఏపీలో చేపల ఉత్పత్తి ఎక్కువగా ఉందన్న ఆయన.. వినియోగం తక్కువగా ఉందన్నారు. ఆక్వా ఉత్పత్తుల వినియోగం పెంచాలన్నారు. ఈ నెల 28 నుంచి 30 వరకు మూడు రోజుల పాటు విజయవాడ వేదికగా సీ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించనున్నామని ఆయన తెలిపారు. ఫిష్ ఆంధ్రా అనే బ్రాండ్‌ను మరింతగా ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉందన్నారు ఫిషరీస్ కమిషనర్ కన్నబాబు. న్యూట్రిషన్ విలువలు ఎక్కువగా ఉండే ఆహారం అని.. అయితే అందుబాటు తక్కువగా ఉంటోందన్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, వినియోగదారుల్లో మరింత అవగాహన పెంచడమే ఈ ఫెస్టివల్ ఉద్దేశమని ఆయన చెప్పారు.

Also Read: Tata Tech IPO : 19 ఏళ్ల తర్వాత చరిత్ర సృష్టించనున్న టాటా టెక్నాలజీస్

భూమి ఆర్గానిక్స్ సంస్థ ఈ ఫుడ్‌ ఫెస్టివల్‌కు సహకారం అందిస్తోందన్నారు. 20 వేల మంది వస్తారని అంచనా వేస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు. ఆక్వా రైతులు, సీ ఫుడ్ ప్రమోటర్స్, ప్రాసెసింగ్ పర్సన్స్, వినియోగదారులు వస్తారన్న ఆయన.. అన్ లిమిటెడ్ సీ ఫుడ్ బఫే 699 రూపాయలకు ఏర్పాటు చేస్తున్నామన్నారు. సీ ఫుడ్ వంటకాల పోటీలు, ఆహార నిపుణులతో సెమినార్స్, 2కే రన్ వంటి విభిన్న కార్యక్రమాలు ఈ మూడు రోజుల్లో ఉంటాయన్నారు. ప్రస్తుతం ఈ ఫెస్టివల్ విజయవాడ కేంద్రంగా నిర్వహించనున్నామన్నారు. తర్వాత వైజాగ్ వంటి ఇతర పట్టణాలు, ఇతర రాష్ట్రాల్లోనూ నిర్వహిస్తామని ఏపీ మత్స్యశాఖ కమిషనర్ కన్నబాబు స్పష్టం చేశారు.