Site icon NTV Telugu

MMTS : హైదరాబాద్‌ వాసులకు అలర్ట్‌.. రేపు, ఎల్లుండి పలు ఎంఎంటీఎస్‌ సేవలు రద్దు

Mmts

Mmts

దక్షిణ మధ్య రైల్వే (SCR) జనవరి 11,12 తేదీలలో కార్యాచరణ కారణాల వల్ల ప్యాసింజర్ మరియు పలు MMTS రైళ్లను తాత్కాలికంగా రద్దు చేసింది. రద్దు చేయబడిన ప్యాసింజర్ రైళ్లలో.. రైలు నం. 07979 విజయవాడ – భద్రాచలం రోడ్, రైలు నం 07278 భద్రాచలం రోడ్ – విజయవాడ, రైలు నం. 07462 సికింద్రాబాద్-వరంగల్, మరియు రైలు నెం. 07463 వరంగల్ – హైదరాబాద్ ఉన్నాయి. అలాగే.. రద్దు చేయబడిన MMTS రైళ్లలో రైలు నం. 47135 మరియు 47137 (2- సర్వీసులు): లింగంపల్లి – హైదరాబాద్ మధ్య, రైలు నం. 47110/47111/47119 (3 ​​సర్వీసులు).

Also Read : MLA Sanjay Kumar : జగిత్యాల నూతన మాస్టర్ ప్లాన్ ను రద్దు చేయిస్తా

హైదరాబాద్ – లింగంపల్లి మధ్య, రైలు నం. 47160/47156/47158/47214/47216 (5 సేవలు) ,ఫలక్‌నుమా – లింగంపల్లి మధ్య, రైలు నం. 47181/47186/47212/47183/47185/47217 (6 – సేవలు): లింగంపల్లి – ఫలక్‌నుమా మధ్య, రైలు నం. 47177 (1-సేవ): రామచంద్రపురం – ఫలక్‌నుమా మధ్య, రైలు నెం.47218 (1 సర్వీస్): ఫలక్‌నుమా – రామచంద్రపురం మధ్య, రైలు నం. 47201 (1 సర్వీస్): ఫలక్‌నుమా – హైదరాబాద్ మధ్య ఉన్నట్లు దక్షిణ మధ్య రైల్వే తన ట్విట్టర్ పేర్కొంది. అయితే.. తెలుగువారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకొనే సంక్రాంతి పండుగకు ప్యాసింజర్‌ రైళ్లు రద్దు చేయడంపై ప్రయాణికులు మండిపడుతున్నారు.

Exit mobile version