Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Scientists Give Good News For Farmers

Good News For Farmers : ఒకసారి వరి నాటువేస్తే.. నాలుగేళ్లు 8సార్లు కోసుకోవచ్చు

Published Date :December 5, 2022 , 9:22 pm
By Rakesh Reddy
Good News For Farmers : ఒకసారి వరి నాటువేస్తే.. నాలుగేళ్లు 8సార్లు కోసుకోవచ్చు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Good News For Farmers : ఎప్పుడూ ఏదో ఒక రూపంలో నష్టపోతున్న రైతన్నలకు చైనా శాస్త్రవేత్తలు శుభవార్త చెప్పారు. ప్రతీ ఏడాది రెండు సార్లు పెట్టుబడి పెట్టి సాగు చేసిన పంట చేతికి అందుతుందో లేదన్న భయానికి స్వస్తి పలికేలా నూతన ఆవిష్కరణ చేసినట్లు ప్రకటించారు. ఒక్కసారి నాటిన వరి నారు ఎనిమిది సార్లు కోతకు వస్తే.. వినడానికే ఆశ్చర్యంగా ఉన్న ఈ కలను చైనా శాస్త్రవేత్తలు ప్రూవ్ చేసి మరీ చూపించారు. పీఆర్‌-23 పేరుతో నూతన వరి వంగడాన్ని సృష్టించారు. నిజానికి ఈ నూతన వరి వంగడాన్ని సైంటిస్టులు నాలుగేళ్ల క్రితమే దానిని అక్కడి రైతుల చేతికి ఇచ్చారట. ఒక్కొక్క సీజన్‌లో ఎకరాకు సగటున 27 క్వింటాళ్ల వరకు దిగుబడి రావడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Read Also: Kim Jong Un: బాంబ్, గన్, శాటిలైట్లు పెట్టని వారంతా దేశద్రోహులే

ఒకసారి వరి కోసిన తర్వాత పిలకలకు నీళ్లు పెడితే మళ్లీ అది ఎదిగి, వరి కంకులు వేస్తుంది. ఇప్పటికే చైనా రైతులు అక్కడ 40 వేల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఆ దేశంలో మంచి ఫలితాలు ఇవ్వడంతో మిగిలిన వారంతా దీనిపై దృష్టి సారిస్తున్నారు. మరోవైపు దుక్కి, వరినాట్లకు అయ్యే ఖర్చులతో పాటు నీటి వినియోగం కూడా గణనీయంగా తగ్గుతం వారికి మరింత ఊరటనిస్తోంది. సాగు నీటి వాడకం 60%, కూలీల ఖర్చు 58%, విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల వ్యయం 49% వరకు కలిసి వస్తుందని చైనా పరిశోధనల్లో తేలింది. దీంతో పీఆర్‌-23 వంగడం మన దేశ వాతావరణ పరిస్థితులకు అనుకూలమో కాదో తేల్చేందుకు అధ్యయనం చేయాలని ICAR అంటే.. భారత వ్యవసాయ పరిశోధనా మండలి దేశంలోని వ్యవసాయ పరిశోధనా సంస్థలను ఆదేశించింది.

Read Also: Gujarat: భక్తితో వెళ్లాడు.. భగవంతుడి కింద అడ్డంగా ఇరుక్కున్నాడు

ICAR సూచనలతో రాజేంద్రనగర్‌లోని భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ అధ్యయనం చేపట్టింది. భారతదేశం సమశీతోష్ణ మండలంలో ఉండడంతో ప్రతి 4 నెలలకో సీజన్‌ మారుతుందని ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధకులు చెబుతున్నారు. ఇటీవలి కాలంలో ఒకే నెలలో వాతావరణ మార్పులు చాలా ఎక్కువగా జరుగుతున్నాయని, పంటలను తెగుళ్లు చుట్టు ముడుతున్నాయని అంటున్నారు. చైనా ఆహారపు అలవాట్లు, వాతావరణం భారత్ కు భిన్నంగా ఉంటుందని చెప్పారు. ఒకవేళ ఈ వరి వంగడం భారతదేశంలోనూ కూడా వస్తే తెలుగు రాష్ట్రాల రైతులకు నిజంగా శుభవార్తే అవుతుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • china
  • Chinese Scientists
  • Paddy Seeds
  • pr23
  • Yunnan University

తాజావార్తలు

  • Virat Kohli-RCB: ఆర్సీబీ అసలు మాస్టర్‌మైండ్ కోహ్లీనే.. పాకిస్థాన్ మాజీల ప్రశంసలు!

  • Adivi Sesh : స్టార్‌ డైరెక్టర్స్‌ స్టార్స్‌ను మాత్రమే డైరెక్ట్‌ చేస్తారా?

  • Smriti Mandhana Wedding: చివరి నిమిషంలో స్మృతి మందాన-పలాష్ పెళ్లి క్యాన్సిల్.. కథలో కొత్త ట్విస్ట్.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Accounts Closed: సంచలన నిర్ణయం తీసుకున్న ప్రభుత్వ రంగ బ్యాంక్.. ఆ ఖాతాలన్నీ క్లోజ్..

ట్రెండింగ్‌

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • HPV వైరస్ అలర్ట్.. చిన్న వయస్సులోనే టీకా తీసుకోకపోతే క్యాన్సర్ ముప్పు.!

  • 50MP సోని కెమెరా, 68W ఫాస్ట్ ఛార్జింగ్ తో Moto G Stylus (2026) లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions