Science Day Celebrations: నేను కూడా సైన్స్ విద్యార్థినే.. అధ్యాపకుడిగా పనిచేశా: రాజ్‌నాథ్ సింగ్
- గచ్చిబౌలి స్టేడియంలో నేషనల్ సైన్స్ డే ఎగ్జిబిషన్
- విజ్ఞాన్ వైభవ్ ప్రదర్శనలో 200 స్టాల్స్ ఏర్పాటు
- నేను కూడా సైన్స్ విద్యార్థినే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘జాతీయ సైన్స్‌డే’ సందర్భంగా హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో జరుగుతున్న నేషనల్ సైన్స్ డే ఎగ్జిబిషన్‌కు కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్, సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఓపెన్ టాప్ జీపులో స్టేడియంలో ఉన్న స్కూల్ అండ్ కాలేజ్ విద్యార్థులందరికీ కేంద్రమంత్రి, సీఎం అభివాదం చేశారు. ఈ సందర్భంగా మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం, సర్ సీవీ రామన్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. డీఆర్‌డీవో, డిఫెన్స్, ఏరోస్పేస్ ఉత్పత్తులకు చెందిన 200 స్టాల్స్ ఏర్పాటు చేశారు. విజ్ఞాన్ వైభవ్ ప్రదర్శనలో రాజ్‌నాథ్ మాట్లాడుతూ తాను కూడా సైన్స్ విద్యార్థినే అని చెప్పారు.
‘సర్ సీవీ రామన్ ఫిబ్రవరి 28న రామన్ ఎఫెక్ట్‌ను కనుగొన్నారు. నోబెల్ గ్రహీత రామన్ గౌరవార్థం ఫిబ్రవరి 28ని జాతీయ సైన్స్ దినోత్సవంగా మనం నిర్వహించుకుంటున్నాం. నేను కూడా సైన్స్ విద్యార్థినే. రాజకీయాల్లోకి ప్రవేశించే ముందు కొన్నాళ్లు సైన్స్ అధ్యాపకుడిగా కూడా పనిచేశాను. ఇంతటి విద్యార్థి సందోహాన్ని ఉద్దేశించి ప్రసంగించడం నాకు చాలా సంతోషంగా ఉంది. మానవ పరిణామాన్ని, సైన్స్ అభివృద్ధిని విద్యార్థులు అధ్యయనం చేయాలి. యువతి యువకులు శాస్తవ్రేత్తలను ఆదర్శంగా తీసుకోవాలి. గ్లోబల్ లీడర్ షిప్ లో యువతదే కీలక పాత్ర. సైన్స్ టెక్నాలజీలో వచ్చే మార్పుల పట్ల విద్యార్ధులు అవగాహన కలిగి ఉండాలి. రక్షణ శాఖ చారిత్రాత్మక విజయాల్లో కేంద్రం విశేష పాత్ర పోషిస్తుంది. ఈ శాఖకు గత కొద్ది సంవత్సరాలుగా మంత్రిగా ఉండటం నా అదృష్టం. సైన్స్ అండ్ టెక్నాలజీ లో కొత్త ఒరవడిని భారతదేశం సృష్టిస్తోంది. పరిశ్రమలు ఏర్పాటు చేయడం ద్వారా ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అన్ని రంగాల్లో భారత దేశం అగ్రగామిగా ఉంది. మానవుని మేధ సంపత్తు చాలా గొప్పది’ అని కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… ‘దేశం రక్షణ బాధ్యత యువతి, యువకులపై ఉంది. రక్షణ శాఖ దేశాన్ని కాపాడంలో కీలక పాత్ర వహిస్తుంది. మిస్సైల్స్ తయారీ చేసే పరిశ్రమలు డీఆర్‌డీఎల్, బీడీఎల్, డీఆర్‌డీవో తెలంగాణాలో ఉండడం సంతోషం. ప్రతియేటా మెకానికల్ & ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్న లక్షకు పైగా విద్యార్దులు ఉద్యోగం కోసం అమెరికా వెళుతున్నారు. తెలంగాణలో ఈరోజు ఏర్పాటు చేసిన డీఆర్‌డీవో ఎగ్జిబిషన్ ఎంతగానో దోహదపడుతుంది. బెంగళూరు తరహాలో తెలంగాణ రాష్ట్రంలోనూ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రక్షణ శాఖ కారిడార్లు ఏర్పాటు చేయాలని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కోరుతున్నాను’ అని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!