NTV Telugu Site icon

Schools Reopen: బడికి వేళాయే.. రేపటి నుండి తెలంగాణలో పాఠశాలలు పునఃప్రారంభం

Telangana Schools Holidyes

Telangana Schools Holidyes

వేసవి సెలవులు అనంతరం స్కూళ్లు పున:ప్రారంభం కానున్నాయి. తెలంగాణలో రేపటి (జూన్ 12) బుధవారం నుంచి బడులు తెరుచుకోనున్నాయి. నేటితో వేసవి సెలవులు ముగియడంతో జూన్ 12 నుంచి తరగతుల్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో చేరికల్ని ప్రోత్సహించేందుకు ఇప్పటికే బడిబాట కార్యక్రమాన్ని ప్రారంబించారు. గతవారం నుంచి.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బడిబాట ప్రారంభమైంది. అందులో భాగంగానే జూన్ 12వ తేదీన తెలంగాణ‌ సీఎం రేవంత్ రెడ్డి స్కూళ్లను పున:ప్రారంభించనున్నారు.

Read Also: Congress: “ఎంతకాలం డీఎంకేపై ఆధారపడాలి”.. తమిళనాడు కాంగ్రెస్ చీఫ్ సంచలన వ్యాఖ్యలు..

ఇదిలా ఉంటే.. ఈ ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో తరగతుల్ని ఉదయం 9 గంటలకే ప్రారంభించనున్నారు. అయితే.. ప్రైవేట్ పాఠశాలల్లో బోధన 8గంటలకే ప్రారంభం అవుతుంటే ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే 9.30కు మొదలు కావడంపై పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ప్రభుత్వ పాఠశాలల్లో బోధన, డ్రాపౌట్ల సంఖ్యను తగ్గించేందుకు విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు కొత్త విద్యా సంవత్సరంలో ప్రతి ప్రభుత్వ పాఠశాలలో కనీసం 90 శాతం విద్యార్ధుల హాజరయ్యేలా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ స్కూళ్లలో ఇకపై ప్రతిరోజు కనీసం 90 శాతం మంది విద్యార్ధులు హాజరు కావాల్సిందేనని తెలిపారు. అందుకోసం పేరెంట్స్ కమిటీలు, విద్యా కమిటీలు, స్థానిక స్వచ్ఛంధ సంస్థలు, ఉపాధ్యాయులను భాగస్వామ్యుల్ని చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Read Also: Chandrababu Naidu’s Oath Taking Ceremony: చంద్రబాబు ప్రమాణస్వీకారం.. బెజవాడకు వీఐపీల క్యూ..