NTV Telugu Site icon

Holiday: జనవరి 22న పలు రాష్ట్రాల్లో స్కూళ్లు, కాలేజీలకు హాఫ్ డే సెలవు..

Holiday

Holiday

Ayodhya: అయోధ్యలో రామ మందిర ప్రతిష్ఠాపనకు సన్నాహాలు దాదాపు పూర్తయ్యాయి. అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవంపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ వాతావరణం నెలకొంది. కాగా, రామాలయం గర్భగుడిలో రాంలాలా ఇక, ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం మాత్రమే మిగిలి ఉంది. అయితే, జనవరి 22న దేశ ప్రజలు రామమందిర ప్రతిష్ఠాపనను ఏకగ్రీవంగా వీక్షించేందుకు పలు రాష్ట్రాల్లో ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. అందులో జనవరి 22న కేంద్ర కార్యాలయాలకు సగం రోజుల సెలవును కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో పాటు పలు రాష్ట్రాల్లో స్కూళ్లు, కాలేజీలకు కూడా హాప్ డే సెలవు ఇచ్చారు.

Read Also: Chandrababu: రాష్ట్ర ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్..! వారికి ఓటు అడిగే హక్కు లేదు..

అయితే, రామభక్తుల మనోభావాలను అర్థం చేసుకుని జనవరి 22న రాంలాలా రామ మందిరానికి సంబంధించిన పవిత్రోత్సవం సందర్భంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అన్ని కార్యాలయాలను మూసివేయాలని ఇప్పటికే ఆదేశించింది. అన్ని పాఠశాలలు, కళాశాలలకు కూడా హాఫ్ డే సెలవు ఉంటుందని తెలిపింది. ఇక, రాష్ట్రంలో మాంసం, మద్యం దుకాణాలు కూడా మూసివేయబడతాయన్నారు.

Read Also: IRFC Share price: రాకెట్ కంటే వేగంగా దూసుకెళ్తున్న రైల్వే షేర్లు.. ఒక్క రోజే 10శాతం పైగా జంప్

అలాగే, శ్రీరామునికి దేశంలోని ప్రతి రాష్ట్రంలోని ప్రతి ప్రాంతంతో కొంత అనుబంధం కలిగి ఉంది. పురాణాల ఆధారంగా, ఛత్తీస్‌గఢ్ శ్రీరాముని తల్లి జన్మస్థలం.. అందుకే అక్కడ కూడా ఈ కార్యక్రమం పట్ల ప్రజల్లో అపారమైన భక్తిభావంతో ఉన్నారు. అయోధ్యలో రామమందిర ప్రతిష్ఠాపన సందర్భంగా ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు సహా అన్ని విద్యాసంస్థలకు సెలవులు ఉంటాయని ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి తెలిపారు. ఇక, బీజేపీ పాలిత రాష్ట్రాలు సైతం హాలీడే ప్రకటించాయి. ఉత్తరాఖండ్‌, హరియాణా, అస్సాం, త్రిపుర, రాజస్థాన్ రాష్ట్రం ప్రభుత్వం కూడా ఈ గ్రాండ్ ఈవెంట్ కారణంగా జనవరి 22 మధ్యాహ్నం 2 గంటల వరకు సెలవు ప్రకటించింది.