చంద్రయాన్-3 ల్యాండింగ్ పురస్కరించుకుని రేపు స్కూళ్లను సా.6.30 వరకు నడపాలన్న నిర్ణయాన్ని విద్యాశాఖ వెనక్కి తీసుకుంది. స్కూళ్ల టైమింగ్స్ పొడిగించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. విద్యార్థులు ఇళ్లలోనే లైవ్ చూడాలని కోరింది. ఎవరైనా చూడకపోతే ఎల్లుండి స్కూళ్లలో చూసే విధంగా ఏర్పాట్లు చేయాలని DEOలను ఆదేశించింది. రెసిడెన్షియల్ స్కూళ్లలో రేపే విద్యార్థులు చూసే విధంగా ఏర్పాట్లు చేయాలంది. అయితే.. నేడు జాబిల్లిపై చంద్రయాన్-3 ల్యాండింగ్ సాయంత్రం 6.04 గంటలకు జరుగనుంది. జాబిల్లి దక్షిణధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్‌కు ప్రయత్నిస్తున్నారు. సాయంత్రం 5.45 గంటల తర్వాత ల్యాండింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది.
Also Read : Telangana Cabinet: రేపు కేబినెట్ విస్తరణ.. పట్నం మహేందర్‌రెడ్డికి చోటు..!
17 నిమిషాల పాటు ఈ ల్యాండింగ్ ప్రక్రియ కొనసాగనుంది. చంద్రయాన్-3 విజయవంతంమైతే భారత్ కొత్త రికార్డు సృష్టించనుంది. చంద్రుని దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్ నిలవనుంది. అయితే.. చంద్రయాన్-3 విజయవంతం కావాలని దేశవ్యాప్తంగా పూజలు నిర్వహిస్తున్నారు. చారిత్రక క్షణాల కోసం భారతీయులు ఎదురుచూస్తున్నారు. జులై 14న చంద్రయాన్-3ని ప్రయోగించింది ఇస్రో. ఈ క్రమంలోనే ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని విద్యార్థులు తిలకించేందుకు ముందు విద్యాశాఖ స్కూల్ టైమింగ్స్‌లో మార్పులు చేసింది. కానీ ఈ నిర్ణయం వెనక్కి తగ్గిన విద్యాశాఖ రెసిడెన్షియల్ స్కూళ్లలో రేపే విద్యార్థులు చూసే విధంగా ఏర్పాట్లు చేయాలని వెల్లడించింది.
Also Read : Armed Forces: సాయుధ బలగాల్లో పెరుగుతున్న ఆత్మహత్యలు.. 13 ఏళ్లలో 1,532 మంది ఆత్మహత్య
