NTV Telugu Site icon

CM YS Jagan: నేటి సీఎం జగన్‌ ఎన్నికల ప్రచార షెడ్యూల్‌ ఇదే..

Jagan

Jagan

CM YS Jagan: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధంమవుతోంది. రేపటితో కీలకమైన ప్రచార ఘట్టానికి తెరపడనుంది. ఈ క్రమంలో అన్ని రాజకీయ పార్టీల నేతలు ప్రచారంలో బిజీబిజీగా గడుపుతున్నారు. తమ ప్రభుత్వంలో చేసి అభివృద్ధి, సంక్షేమం, మంచి పనులు వివరిస్తూ ముందుకెళ్తున్నారు. ఈ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి మరోసారి ఆశీర్వదించాలని కోరుతున్నారు. ఈ క్రమంలో.. సీఎం జగన్ రాష్ట్రాన్ని మొత్తం చుట్టేశారు. కాగా.. నేడు కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.

Read Also: AP High Court: ఏపీలో డీబీటీల పంపిణీపై హైకోర్టు కీలక ఆదేశాలు

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచార సభల నేటి షెడ్యూల్ ఎలా ఉందంటే..
ఇవాళ ఉదయం 10 గంటలకు గుంటూరు పార్లమెంట్ పరిధిలోని మంగళగిరి పాత బస్టాండ్ సెంటర్లో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు చిత్తూరు పార్లమెంట్ పరిధిలోని నగరి నియోజకవర్గం పుత్తూరులో కార్వేటినగరం రోడ్ కాపు వీధి సర్కిల్లో జరిగే సభలో పాల్గొంటారు. అక్కడి నుంచి వైఎస్సార్ కడప జిల్లాకు రానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు కడప నగరంలోని మద్రాస్ రోడ్ శ్రీ పొట్టి శ్రీరాములు సర్కిల్లో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు. మొత్తంగా రేపు మూడు నియోజకవర్గాల్లో ప్రచారంలో పాల్గొననున్నారు సీఎం జగన్‌. ఇక, జగన్‌ సభలకు సంబంధించి వైసీపీ శ్రేణులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.