NTV Telugu Site icon

రిటైల్ రుణాలపై ఎస్‌బీఐ కీలక నిర్ణయం

sbi

sbi

రిటైల్ రుణాలపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ రిటైల్ రుణాల‌పై ప్రాసెసింగ్ ఫీజ‌లను ర‌ద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో పాటు వ‌డ్డీ రేట్ల‌ను కూడా త‌గ్గించింది. పర్సనల్, పెన్షన్ లోన్‌ కస్టమర్లు ఏ ఛాన‌ల్‌ ద్వారా రుణం తీసుకున్నప్పటికీ వంద శాతం ప్రాసెసింగ్ ఫీజును ర‌ద్దు చేస్తున్నట్లు తెలిపింది. వ్యక్తిగ‌త రుణ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్న ఫ్రంట్‌లైన్ హెల్త్‌ కేర్‌ వ‌ర్కర్స్‌కు 50 బేసిస్ పాయింట్ల ప్రత్యేక వ‌డ్డీ రాయితీని ఇస్తున్నట్లు ప్రకటించింది. దీన్ని త్వర‌లోనే కారు, బంగారు రుణాల‌ దర‌ఖాస్తుదారులకూ అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది.