Site icon NTV Telugu

Sbi Scheme : అదిరిపోయే స్కీమ్.. రూ. లక్ష ఇన్వెస్ట్ చేస్తే చాలు.. మరో లక్ష ఆదాయం..

Sbi Scheme

Sbi Scheme

ప్రముఖ దేశీయ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్ల కు అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. స్పెషల్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్ గడువు పొడిగించింది.. బ్యాంక్ ఉయ్ కేర్ పేరుతో ప్రత్యేకమైన ఎఫ్‌డీ స్కీమ్‌ను అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకం ఇప్పుడు మరింత కాలం అందుబాటులో ఉంటుందని చెప్పుకోవచ్చు. అందువల్ల అధిక వడ్డీ రేటు పొందాలని భావించే వారికి మంచి సమయం.. స్కీమ్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం..

ప్రస్తుతం ఎస్‌బీఐ ఉయ్ కేర్ డిపాజిట్ స్కీమ్‌పై 7.5 శాతం వరకు వడ్డీ లభిస్తోంది. పదేళ్ల వరకు టెన్యూర్‌తో డబ్బులు దాచుకోవచ్చు. సీనియర్ సిటిజన్స్‌కు ఎస్‌బీఐ సాధారణంగా 50 బేసిస్ పాయింట్ల మేర అధిక వడ్డీ అందిస్తుంది. అయితే ఈ స్పెషల్ ఎఫ్‌డీ స్కీమ్‌పై అయితే అదనంగా మరో 50 బేసిస్ పాయింట్లు వరకు అధిక వడ్డీని సొంతం చేసుకోవచ్చు..

ఈ స్కీమ్ లో రూ.లక్ష డిపాజిట్ చేస్తే..ఈ స్కీమ్ కింద రూ. 2 లక్షలు పొందొచ్చు. ఎలా అంటే మీరు ఎంచుకునే టెన్యూర్ పదేళ్లు ఉండాలి. అప్పుడు మీరు రూ. లక్ష పెడితే.. మెచ్యూరిటీ సమయంలో రూ. 2 లక్షలకు పైగా లభిస్తాయి.. ఇకపోతే ఉయ్ కేర్ డిపాజిట్ స్కీమ్‌లో రూ. 5 లక్షలు ఇన్వెస్ట్ చేయాలని భావిస్తే.. అప్పుడు పదేళ్ల టెన్యూర్‌ తర్వాత మీ చేతికి రూ.10 లక్షల 50 వేలకు పైగా పొందవచ్చు.. . అంటే మీరు ఎంత పెడితే అంత డబ్బు రెట్టింపు అవుతుందని చెప్పుకోవచ్చు.. ఒక్కసారి డబ్బులు ఎఫ్‌డీ చేశాక తర్వాత టెన్యూర్ అయిపోయేంత వరకు అలానే ఉండాలి.. ఏదైనా పరిస్థితుల కారణంగా మధ్యలో డ్రాప్ అయితే పెనాల్టీ పడుతుంది.. ఈ విషయాలను తప్పక చూసుకోవాలి..

Exit mobile version