SBI Home Loans: గృహ రుణం తీసుకోవాలనుకొనే వారికి గుడ్ న్యూస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రతి ఒక్కరికి సొంతిళ్లు కట్టుకోవాలనే కోరిక అందరికి ఉంటుంది.. అయితే అంత డబ్బులు ఎవరికి దగ్గర ఉండవు.. దాంతో అందరు బ్యాంకులో లోన్ తీసుకోవాలని అనుకుంటారు.. అందులో ఏ బ్యాంకులో లోన్ తీసుకుంటే తక్కువ వడ్డీ పడుతుందో తెలుసుకోకుండా ఏదొక బ్యాంకులో తీసుకొని వడ్డీ కట్టలేక ఇబ్బందులు పడుతుంటారు.. అలాంటివారికి ప్రముఖ బ్యాంకు ఎస్బిఐ అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్తుంది.. అద్భుతమైన తగ్గింపు వడ్డీ రేట్లను అందిస్తోంది. అయితే ఈ ఆఫర్ మీరు పొందుకోవాలంటే మీ సిబిల్ స్కోర్ బాగా ఉండాల్సిందే మరి. ఈ నేపథ్యంలో ఎస్బీఐ ఆఫర్ ఏంటి? సిబిల్ స్కోర్ ఎంత ఉంటే సులభంగా మంచి వడ్డీ రేటుకు లోన్ మంజూరువుతుంది తెలుసుకుందాం..
హోమ్ లోన్ తీసుకోవాలని వారికి ఎస్బీఐ ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. ప్రత్యేక గృహ రుణ క్యాంపెయిన్ లో భాగంగా ఏకంగా 65బేస్ పాయింట్లు వరకూ తగ్గించి లోన్లు మంజూరు చేయనున్నట్లు ప్రకటించింది. అంటే లోన్ పై వడ్డీ రేటు తగ్గుతుంది. ఈ తగ్గింపు వచ్చే డిసెంబర్ 31 వరకూ అందుబాటులో ఉంటుందని ప్రకటించింది. ఈ మేరకు ఎస్బీఐ వెబ్ సైట్లో ఓ ప్రకటనను జారీ చేసింది. దానిలో పూర్తి వివరాలు ఉన్నాయి. అయితే ఈ ఆఫర్ మీరు దక్కించుకోవాలంటే మీకు తప్పనిసరిగా సిబిల్ స్కోర్ అధికంగా ఉండాలి. సిబిల్ స్కోర్ లేకపోతే ఆఫర్ వర్తించదు..
Also Read
- IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్దీప్ పేస్.. నేడే తోలి టీ20 మ్యాచ్..!
- Chandrababu, Pawan Kalyan Meet: స్థానిక ఎన్నికలపై దృష్టిపెట్టిన చంద్రబాబు, పవన్.. నేడు కూటమి నేతల కీలక భేటీ..
- పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
- YS Jagan: స్థానిక సంస్థల ఎన్నికలపై జగన్ ఫోకస్.. ఇన్చార్జ్లతో వన్ టు వన్ భేటీలు
సిబిల్ స్కోర్ బాగా ఉంటేనే లోన్ వస్తుంది.. ఈ సిబిల్ స్కోర్ విలువ 300 నుంచి 900 మధ్య ఉంటుంది. 750-800 లేదా అంతకంటే ఎక్కువ సిబిల్ స్కోర్‌ల ఉంటే ఎస్బీఐ ఆఫర్ ప్రకారం హోమ్ లోన్ వడ్డీ రేటు 55 బీపీఎస్ పాయింట్లు తగ్గి 8.60 శాతంగా ఉంటుంది.700 -749 మధ్య సిబిల్ స్కోర్ ఉంటే ఎస్బీఐ ఆఫర్ లో 65 బీపీఎస్ తగ్గింపు అందిస్తోంది. ఇప్పుడు మీకు వడ్డీ రేటు 8.7శాతంగా ఉంటుంది.. 550- 699 మధ్య సిబిల్ స్కోర్ ఉంటే బ్యాంక్ ఎలాంటి తగ్గింపునను అందిచదు. అప్పుడు హోమ్ లోన్ పై వడ్డీ రేటు 9.45శాతంగా నుంచి 9.65 శాతంగావరకూ ఉంటుంది.. ఇకపోతే గృహ రుణాలపై ఈ ప్రత్యేక ప్రచారానికి సంబంధించి ఎస్బీఐ కొన్ని ముఖ్యమైన అంశాలను కూడా జాబితా చేసింది. మహిళా రుణగ్రహీతలకు లభించే వడ్డీ రాయితీలు, ఉత్పత్తి స్థాయిలో లభించే రాయితీలు ఈ క్యాంపెయి రేట్లలో కలిపి ఉంటాయని బ్యాంక్ తెలిపింది. అంతేకాకుండా, 30 లక్షల వరకు రుణాలకు 10 బీపీఎస్ ప్రీమియం కొనసాగుతుంది. మొత్తంగా చూసుకుంటే దీన్ని బట్టే లోన్ ను అమౌంట్ ఉంటుంది..
తాజావార్తలు
-
Delhi ACP Vivek Bhagat: మహిళా జర్నలిస్టు ఫిర్యాదు ఎఫెక్ట్.. ACP వివేక్ భగత్ అదనపు DCP బాధ్యతలు నిలిపివేత
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్దీప్ పేస్.. నేడే తోలి టీ20 మ్యాచ్..!
-
‘Dada’ : ‘దాదా’ ఈజ్ బ్యాక్.. మైసూర్ షూటింగ్లో అడుగుపెడుతున్న నటసింహం
-
Mecca Defence Pact: హౌతీ దాడులతో సౌదీలో టెన్షన్.. బలగాలు పంపేందుకు పాకిస్థాన్, టర్కీ కీలక నిర్ణయం!
-
Chandrababu, Pawan Kalyan Meet: స్థానిక ఎన్నికలపై దృష్టిపెట్టిన చంద్రబాబు, పవన్.. నేడు కూటమి నేతల కీలక భేటీ..
ట్రెండింగ్
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి