NTV Telugu Site icon

SBI: ఎస్‌బీఐ క్లర్క్ రిక్రూట్‌మెంట్‌.. దరఖాస్తుకు చివరి తేదీ రేపే..!

Sbi

Sbi

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) 13 వేలకు పైగా క్లర్క్ (జూనియర్ అసోసియేట్స్-కస్టమర్ సపోర్ట్ సేల్స్) పోస్టుల కోసం రిక్రూట్ చేస్తోంది. ఈ రిక్రూట్‌మెంట్‌లో పాల్గొనడానికి దరఖాస్తుకు చివరి తేదీ ఈరోజే.. (7 జనవరి 2025). అయితే.. గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులై ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఓ సువర్ణావకాశం. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు SBI అధికారిక వెబ్‌సైట్, sbi.co.in లేదా ఈ పేజీలో ఇవ్వబడిన డైరెక్ట్ లింక్‌పై క్లిక్ చేసి ఆన్‌లైన్ ఫారమ్‌ను నింపవచ్చు.

ఈ రిక్రూట్‌మెంట్‌లో పాల్గొనడానికి.. అభ్యర్థి గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ఇన్‌స్టిట్యూట్ నుండి ఏదైనా స్ట్రీమ్‌లో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండాలి. అంతేకాకుండా.. అభ్యర్థికి స్థానిక భాషపై అవగాహన ఉండాలి. దరఖాస్తు సమయంలో అభ్యర్థి కనీస వయస్సు 20 సంవత్సరాల కంటే తక్కువ ఉండకూడదు.. గరిష్ట వయస్సు 28 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదు. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం గరిష్ట వయస్సులో సడలింపు ఇచ్చారు. 2024 ఏప్రిల్ 1 తేదీని దృష్టిలో ఉంచుకుని వయస్సు పరిమితి చూస్తారు.

Read Also: HMPV Virus: భారత్‌లోకి ఎంట్రీ ఇచ్చిన చైనా కొత్త వైరస్.. 8 ఏళ్ల చిన్నారికి నిర్ధారణ

ఈ రిక్రూట్‌మెంట్‌లో చేరడానికి అభ్యర్థులు స్వయంగా దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్ ఎలా నింపాలో తెలుసుకుందాం..
SBI క్లర్క్ రిక్రూట్‌మెంట్ దరఖాస్తు ఫారమ్ 2025 నింపడానికి.. ముందుగా అధికారిక వెబ్‌సైట్ sbi.co.in ని సందర్శించండి.
వెబ్‌సైట్ హోమ్ పేజీలో కెరీర్ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన లింక్‌పై క్లిక్ చేయండి.
ఇప్పుడు కొత్త పేజీలో కొత్త రిజిస్ట్రేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. అవసరమైన వివరాలను పూరించడం ద్వారా నమోదు చేసుకోండి.
రిజిస్ట్రేషన్ తర్వాత.. అభ్యర్థులు ఇతర వివరాలు, సంతకం, ఫోటోగ్రాఫ్ అప్‌లోడ్ చేయాలి.
చివరగా అభ్యర్థులు నిర్ణీత రుసుము చెల్లించి ఫారమ్‌ను సమర్పించాలి.

దరఖాస్తు ఫారమ్‌ను పూరించిన తర్వాత.. అభ్యర్థులు తప్పనిసరిగా నిర్ణీత రుసుము చెల్లించాలి. అప్పుడు మాత్రమే మీరు నింపిన దరఖాస్తును స్వీకరిస్తారు. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు దరఖాస్తు రుసుము రూ.750గా నిర్ణయించారు. SC, ST, PH వర్గం నుండి వచ్చే అభ్యర్థులు ఈ రిక్రూట్‌మెంట్‌లో చేరడానికి దరఖాస్తు ప్రక్రియను ఉచితంగా పూర్తి చేయవచ్చు.

Show comments