Site icon NTV Telugu

SBI Alert: ఎస్‌బీఐ కస్టమర్స్‌కు అలర్ట్.. ఇకపై ఆ నంబర్ల నుంచే అధికారిక కాల్స్‌..!

Sbi

Sbi

SBI Alert: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) దేశపు అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్. కోట్లాది మందికి బ్యాంకింగ్ సేవలను అందించే విధంగా దేశంలోని అనేక శాఖల ద్వారా సేవలు అందిస్తోంది. డిజిటల్ బ్యాంకింగ్ యుగంలో వినియోగదారుల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరిస్తూ వస్తోంది. ఇకపోతే, ఈమధ్య కాలంలో సైబర్ నేరాలు భారీగా పెరుగుతున్న వేళ వినియోగదారుల భద్రత కోసం ఎస్‌బీఐ (SBI) ఒక కీలక ప్రకటన చేసింది. ఇకపై ఎస్‌బీఐ నుండి వచ్చే అధికారిక కాల్స్ అన్నీ +91-1600 తో ప్రారంభమయ్యే నంబర్ల నుంచే వస్తాయని బ్యాంక్ స్పష్టం చేసింది.

Read Also: Ankineedu Prasad: మచిలీపట్నం మాజీ ఎంపీ మృతి.. సీఎం దిగ్భ్రాంతి

ఈ ఏడాది జనవరిలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అన్ని బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు ముఖ్య సూచనలు చేసింది. అందులో భాగంగా కస్టమర్ సేవల కోసం 1600 సిరీస్‌ నంబర్లను ఉపయోగించాలనీ, ప్రమోషనల్ లేదా మార్కెటింగ్ కాల్స్‌కు 1400 సిరీస్‌ ఉపయోగించాలనీ ఆదేశించింది. ఇది కస్టమర్లకు నమ్మదగిన కాల్‌ ఏదో తెలుసుకోవడంలో ఉపయోగపడుతుందన్నది ఆర్బీఐ ఉద్దేశ్యం.

Read Also: G7 Summit: జీ-7 సమ్మిట్ కు ప్రధాని మోడీకి ఆహ్వానం..

+91-1600 తో ప్రారంభమయ్యే నంబర్ల నుండి మీకు కాల్ వస్తే, అది నిబంధనల ప్రకారం చట్టబద్ధమైన కాల్ అని భావించాలి. ఇవి కేవలం బ్యాంకింగ్ లావాదేవీలు, సేవల సంబంధిత సమాచారం కోసం మాత్రమే ఉపయోగించబడతాయి. స్పామ్ లేదా మోసపూరిత కాల్స్‌ తో వేరుగా గుర్తించడంలో ఈ విధానం ఎంతగానో సహాయపడుతుందని ఎస్‌బీఐ పేర్కొంది.

Exit mobile version