NTV Telugu Site icon

Video Viral: పామును ప్రేమగా చూస్తూ.. ఓ ముద్దుపెట్టిన ఎద్దు

Cow

Cow

తన ముందు ఉన్న పామును ఓ ఎద్దు ప్రేమగా చూస్తూ అలానే నిలబడి పోయింది. సామాన్యంగా ఎద్దులను చూసిన పాములు వాటి దగ్గరకు రాకుండా దూరంగా వెళ్తుంటాయి.. ఎందుకంటే వాటి కాళ్ల కింద పడితే నుజ్జునుజ్జు అవుతాయని భయానికి దరిదాపుల్లో ఉండవు. కానీ ఇక్కడ కనపడే అరుదైన దృశ్యాన్ని చూస్తే.. అస‌లు ఇది నిజ‌మేనా..? అని అనిపిస్తుంది. ఆ వీడియోలో నాగుపాముతో ఓ ఆవు కాసేపు చెలిమి చేసింది. అంతేకాకుండా.. పాము ప‌డ‌గ‌కు ముద్దు పెట్టింది. అయినప్పటికీ ఆ పాము ఆవును కాటేయ‌లేదు. ఇప్పుడు ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

ఈ వీడియోను ఇండియ‌న్ ఫారెస్ట్ స‌ర్వీస్ ఆఫీస‌ర్ సుశాంత నంద త‌న ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. వర్ణించడం కష్టం అని క్యా్ప్షన్ ఇచ్చారు. ప్రకృతిలో ఇది నిజ‌మైన ప్రేమ అని పేర్కొన్నారు. ఈ వీడియోను అప్‌లోడ్ చేసిన 15 గంటల్లోనే మూడున్నర ల‌క్షల మంది వీక్షించారు. 5 వేల మంది లైక్ చేశారు. అంతేకాకుండా కొందరు నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేశారు. ప్రకృతిని అర్థం చేసుకోవ‌డం అంత సులువు కాదు అని ఓ యూజ‌ర్ పేర్కొన్నాడు. ఆ స్నేహ‌బంధం అద్భుత‌మ‌ని మ‌రో యూజ‌ర్ రాసుకొచ్చాడు. నంది నాగదేవ్‌తో ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోందని.. మరొక వినియోగదారు రాశారు.