Site icon NTV Telugu

Save The Tigers 2: సీజన్ 1 కు మించి సీజన్ 2.. ఓటీటీలో దూసుకుపోతున్న ‘సేవ్ ది టైగర్స్ 2’..!

16

16

గతేడాది ఓటీటీలో విడుదలై క్రేజీ సక్సెస్ అందుకున్న సిరీస్ ‘సేవ్ ది టైగర్స్’. మహీ వీ రాఘవ నిర్మాతగా చేసిన వెబ్ సిరీస్ ‘సేవ్ ది టైగర్స్’. ఇక తాజాగా ఈ సిరీస్‌కు సీక్వెల్‌గా ‘సేవ్ ది టైగర్స్ 2 ‘ ప్రేక్షకుల ముందుకు రాగా ప్రస్తుతం ఓటీటీలో దుమ్ము దులిపేస్తున్నది. ప్రియదర్శి, అభినవ్ గోమటం, చైతన్య, సీరత్ కపూర్ తదితరుల తారాగణం ఇందులో నటించగా.. మార్చి 15 తేదీన ‘సేవ్ ది టైగర్స్ 2’ ఓటీటీలో ప్రెకషకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సిరీస్‌కు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

Also read: AP Pensions: ఏపీలో ఏప్రిల్ నెల పింఛన్లు రెండు రోజులు ఆలస్యం.. కారణం అదే..?

అరుణ్ కొత్తపల్లి దర్శకత్వంలో ప్రియదర్శి, జోర్దార్ సుజాత, అభినవ్ గోమటం, పావని గంగిరెడ్డి, కృష్ణ చైతన్య, తేజస్విని శర్మలు మూడు జంటలుగా నటించారు. ఇక ఇందులో కిడ్నాప్ గురైన ఓ సినీ తారగా సీరత్ కపూర్ కూడా నటించారు. ఇక ఈ సిరీస్ లో భార్యభర్తల మధ్య చిన్నచిన్న కొట్లాటలు, ప్రేమాభిమానాల చుట్టు అల్లుకొన్న మధ్య తరగతి కుటుంబాలకు చెందిన ఈ బ్యాక్ డ్రాప్‌ కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది.

Also Read: Venky Sequel: వెంకీ సీక్వెల్ పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్ శ్రీను వైట్ల..!

ఈ సిరీస్‌ కు డిస్నీ+హాట్ స్టార్‌ లో రిలీజై రికార్డు స్థాయి వ్యూయింగ్ మినిట్స్ నమోదైనట్టు చిత్ర యూనిట్ తెలిపింది. ఇందులో భాగంగా తొలి సీజన్‌ కు మించి సీజన్ 2 రెస్పాన్స్‌ ను కూడగట్టుకోవడంపై ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు చిత్ర బృందం. సీజన్ 1 సకెస్స్ తర్వాత అందరూ ఛాలంజ్ గా తీసుకొని నిర్మించిన కామెడీ, ఎమోషనల్ సిరీస్‌ కు ప్రజల నుంచి ఊహించని విధంగా రెస్పాన్స్ రావడంపై సంతృప్తిని వ్యక్తం చేశారు.

Exit mobile version