Airtel Annual Plan Hikes from July 3rd: ప్రముఖ టెలికాం కంపెనీ ‘భారతి ఎయిర్‌టెల్’ మొబైల్ ప్లాన్ ధరలను పెంచిన విషయం తెలిసిందే. ఎయిర్‌టెల్ తన టారిఫ్ ధరలను 11 నుంచి 21 శాతం మేర పెంచింది. పెరిగిన ధరలు జులై 3 నుంచి అమల్లోకి వస్తాయి. అంటే.. జులై 2 అర్ధరాత్రి నుంచే అమల్లోకి రానున్నాయి. పాత ధరలు మరికొన్ని గంటలు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఈలోపు రీఛార్జి చేసుకున్న వారు భారీగా ఆదా చేసుకోవచ్చు.
ఎయిర్‌టెల్‌లో వార్షిక ప్లాన్ ఉన్న విషయం తెలిసిందే. రోజుకు 2జీబీ డేటా, అపరిమిత కాల్స్‌తో రూ.2999 వార్షిక ప్లాన్‌ను అందిస్తోంది. జులై 3 నుంచి ఈ ప్లాన్ ధర రూ.3,599కి చేరనుంది. వార్షిక ప్లాన్‌పై ఏకంగా రూ.600 పెరిగింది. జులై 2 అర్ధరాత్రి లోపు మీరు వార్షిక ప్లాన్‌ను రీఛార్జి చేసుకుంటే.. రూ.600 ఆదా చేసుకోవచ్చు. అలానే రూ.719 ప్లాన్‌ను రీఛార్జి చేసుకుంటే రూ.140, రూ.549 ప్లాన్‌ను రీఛార్జి చేసుకుంటే రూ.100, రూ.839 ప్లాన్‌ను రీఛార్జి చేసుకుంటే రూ.140, రూ.1799 ప్లాన్‌ను రీఛార్జి చేసుకుంటే రూ.200 మీరు ఆదా చేసుకోవచ్చు.
Also Read: Virat Kohli-Rohit Sharma: ఫొటో దిగుదామని రోహిత్‌ను నేనే కోరా: కోహ్లీ
ఎయిర్‌టెల్‌లో యాక్టివ్ ప్లాన్ అందుబాటులో ఉండగా.. మరో ప్లాన్‌ను రీఛార్జి చేసుకుంటే తక్షణమే ఆ ప్లాన్ యాక్టివేట్ అవుతుంది. పాత ప్లాన్‌నే రీఛార్జి చేసుకున్నప్పుడు మాత్రమే క్యూలో ఉంటోందని పలువురు పేర్కొంటున్నారు. ఇక జియో పెరిగిన ధరలు జులై 3 నుంచి మల్లోకి రానున్నాయి. అలానే వొడాఫోన్ ఐడియా కొత్త ప్లాన్ ధరలు జులై 4 నుంచి అమల్లోకి రానున్నాయి.