NTV Telugu Site icon

Real Estate: “పొదుపు మంత్రం” హైదరాబాద్‌లో సొంతింటి కల.. నెరవేర్చుకోండి ఇలా…

Hyderabad

Hyderabad

చాలా మందికి సొంతి ఇళ్లు కట్టుకోవాలనే కల ఉంటుంది. సొంతిళ్లు ఉంటే ఆ ధీమానే వేరు. మధ్యతరగతి నుంచి సంపన్నుల వరకు అంతా తమ తమ స్థాయిని బట్టి సొంతిళ్లు కొనుగోలు చేస్తుంటారు. ఇప్పటివరకు అద్దెకు ఉన్నావాళ్లు సైతం ఇప్పుడు సొంతింటి కోసం ఆరాట పడుతున్నారు. ఎవరి స్థాయిని బట్టి, వారి బడ్జెట్‌కు అనుగుణంగా ఎక్కడో ఓ చోటా సొంతిళ్లు కట్టుకోవాలని, లేదా కొనుగోలు చేయాలని ఎంతో మంది కోరుకుంటున్నారు. హైదరాబాద్‌ రియాల్టీ మార్కెట్‌లో ఇళ్ల ధరలు ప్రతి ఎటా పెరుగుతూనే ఉన్నాయి.

ఈ ఏడాది మాత్రం కొంత స్థిరంగా ధరలు…

కానీ.. ఈ ఏడాది మాత్రం కొంత స్థిరంగా ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. మళ్లీ ఒకేసారి పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా.. పెరుగుతున్న ధరలకు సంబంధం లేకుండా కొంత మంది కొంటునే ఉన్నారు. వారికెలా సాధ్యమవుతుందని మిగితా వారు తలల పట్టుకుంటున్నారు. కొద్దిగా ఆర్థిక ప్రణాళిక ఉంటే మీరూ సొంతింటివారు కావొచ్చు అని రియాల్టీ నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రణాళికలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.. గత పద్నాలుగేళ్ల కిందట నగరం శివార్లలో రూ.20 లక్షలకు వ్యక్తిగత ఇళ్లు వచ్చేది. ఇప్పుడ కొండెక్కిన ధరల కారణంగా ఇప్పుడు అదే ప్రదేశంలో రూ.50-60 లక్షల ధరల్లో అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్ల ధరలు పలుకుతున్నాయి.

ఇల్లు కొనేందుకు ఆదాయ, ఈఎంఐ నిష్పత్తి ముఖ్యం..

2010లో హైదరాబాద్‌లో గృహరుణంతో ఇల్లు కొనాలంటే ఆదాయంలో ఈఎంఐ చెల్లింపునకే 47 శాతం పోయేది. అప్పట్లో ఇంటి ధరలు తక్కువ ఉండేవి. ఆదాయం కూడా కనిష్టంగా ఉండేది. కాబట్టి ఎక్కువ మంది కొనలేకపోయారు. 2022 నుంచి 2024 వరకు పరిస్థితులు మారాయి. ఆదాయంలో 30 శాతం ఈఎంఐకి కేటాయించగల్గితే ఇల్లు కొనవచ్చు అని నైట్‌ఫ్రాంక్‌ ఇండియా అఫర్డబులిటీ ఇండెక్స్‌ చెబుతోంది. అధ్యయణాల ప్రకారమే ఈ వివరాలు వెల్లడించింది. పెరిగిన ధరల నేపథ్యంలో వ్యక్తిగత ఇల్లు కంటే.. ఫ్లాట్‌ కే మొగ్గుచూపుతున్నారు.

కొవిడ్‌ అనంతరం 2021లో వడ్డీరేట్లు తగ్గడంతో ఈఎంఐ భారం క్షీణించింది. ఆదాయంలో 28 శాతం ఈఎంఐ చెల్లించగలిగి స్థోమత కల్గినవారు ఇల్లు కొన్నారు. స్థలాలు కూడా సొంత చేసుకున్నారు. ఆ సమయంలో ధరలు పెరిగినా ధైర్యం చేసి కొన్నారు. ఇప్పుడు వడ్డీరేట్లు 9 శాతం పైనే ఉండటంతో పలువురు భారంగా భావిస్తున్నారు. అయినా సరే 30 శాతం ఈఎంఐ కోసం కేటాయించగల్గితే ఇల్లు కొనుగోలు సాధ్యమేనని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. ఇప్పటి నుంచే మీ ఆదాయంలో 30శాతం ఈఎంఐకి కేటాయించి ఇళ్లు కొనుగోలు చేయండి..