Flu Vaccine: సౌదీ అరేబియాలో ఇన్ ప్లూఎంజాతో బాధపడుతున్న వారి సంఖ్య పెరిగింది. టీకా సమయానికి అందకపోతే, వ్యాధి సంక్లిష్టంగా మారి అది ప్రాణాంతకం అవుతుందని విశ్లేషకులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో ప్రజలు వ్యాక్సిన్ తీసుకోవాలంటూ ప్రభుత్వం ప్రజలను బతిమిలాడుతోంది. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ఇన్ ప్లూఎంజా వైరస్ బారిన పడుతున్నారు. ఐదేళ్లలోపు పిల్లలు, గర్భిణులు, వృద్ధులు, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు, ఆస్తమాతో సహా శ్వాసకోశ వ్యాధులు, హృద్రోగులు ప్రమాదంలో ఉన్నారు.
Read Also: Crime News: డామిట్ కథ అడ్డం తిరిగింది.. మ్యాట్రిమోని మోసగాడి తిక్క కుదిరింది
ఈ క్రమంలోనే ఫ్లూ వ్యాక్సిన్‌ను తీసుకోవాలని సౌదీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రజలకు సూచించింది. ఫ్లూ వ్యాక్సిన్ ప్రభావవంతంగా, సురక్షితంగా ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి డాక్టర్ ముహమ్మద్ అల్ అబ్దుల్ అలీ మాట్లాడుతూ.. ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవాలని సౌదీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రజలను కోరారు. ఫ్లూ వ్యాక్సిన్ దాదాపు ఎనభై శాతం ప్రభావవంతంగా ఉంటుంది. వ్యాక్సిన్‌ను స్వీకరించడం వల్ల ఇంటెన్సివ్ కేర్ అవసరమయ్యే రోగుల సంఖ్య తగ్గుతుంది. వ్యాక్సినేషన్ కోసం సెహతి అప్లికేషన్ ద్వారా బుకింగ్ చేసుకోవచ్చని డాక్టర్ ముహమ్మద్ అల్ అబ్దుల్ అలీ తెలిపారు. వ్యాధి నియంత్రణ కోసం, ప్రజలు రద్దీగా ఉండే ప్రదేశాలకు దూరంగా ఉండటం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం, కళ్లు, నోటిని నేరుగా తాకకూడదు, తుమ్మినప్పుడు లేదా దగ్గినప్పుడు టిష్యూలను ఉపయోగించడం, మాస్క్‌లు ధరించడం వంటి సూచనలను పాటించాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి తెలిపారు.
