NTV Telugu Site icon

Saudi Airlines: ల్యాండ్ అవుతుండగా విమానంలో మంటలు.. ఫ్లైట్లో 276 మంది ప్యాసింజర్లు

Saudi Airlines

Saudi Airlines

సౌదీ ఎయిర్‌లైన్స్‌కు చెందిన SV792 విమానం పాకిస్థాన్‌లోని పెషావర్ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా మంటలు చెలరేగాయి. ల్యాండింగ్ గేర్‌లో సమస్య కారణంగా టైర్‌కు మంటలు వచ్చాయి. రియాద్‌ నుంచి పెషావర్‌ చేరుకున్న ఆ విమానం ల్యాండింగ్ గేర్‌లో సమస్య తలెత్తింది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం జరగలేదు. కాగా, దీనిని గమనించిన ఏటీసీ సిబ్బంది పైలట్‌ను అప్రమత్తం చేశారు. ఆ విమానాన్ని వెంటనే రన్‌వే వద్ద నిలిపివేశారు. ఎమర్జెన్సీ డోర్‌ ద్వారా ప్రయాణికులను కిందకు దించారు. మీడియా నివేదికల ప్రకారం.. మొత్తం 276 మంది ప్రయాణికులు, 21 మంది సిబ్బంది విమానంలో ఉన్నారు.

Read Also: Live In Relationships: మహిళతో రిలేషన్‌షిప్‌లో ఉన్న వ్యక్తిని భర్తగా భావించి క్రూరత్వం కింద విచారించలేం..

అయితే టైరు పగిలిన సమాచారం అందడంతో ప్రయాణికుల్లో భయాందోళన నెలకొంది. ఎమర్జెన్సీ డోర్ ద్వారా ప్రయాణికులందరినీ బయటకు తరలించారు. సివిల్ ఏవియేషన్ అథారిటీ, అగ్నిమాపక శాఖ అధికారులు మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ సంఘటనను సౌదీ ఎయిర్‌లైన్స్ ధృవీకరించింది.