NTV Telugu Site icon

Satyender Jain: సత్యేందర్ జైన్ బెయిల్‌ ఈనెల 25వరకు పొడిగింపు

Jain

Jain

Satyender Jain: ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్ బెయిల్ విచారణ మంగళవారం సుప్రీంకోర్టులో వాయిదా పడింది. ఆరోగ్యకారణాల రీత్యా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత జైన్‌కు మంజూరైన బెయిల్‌ను సెప్టెంబర్ 25 వరకు పొడిగించారు. సత్యేందర్ జైన్ ను విచారించాలని ఈడీ అధికారులు కోర్టును కోరారు. మే 2022లో మనీలాండరింగ్ కేసులో జైన్‌ను ED అరెస్టు చేయగా.. ఈ సంవత్సరం ప్రారంభంలో అతనికి వైద్య కారణాలతో మధ్యంతర బెయిల్ మంజూరైంది.

Read Also: Jammu Kashmir: రాజౌరీలో ఎన్‌కౌంటర్‌.. ఓ ఉగ్రవాది హతం

విచారణను వాయిదా వేయాలని అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్‌వి. రాజు అభ్యర్థించడంతో న్యాయమూర్తులు ఎఎస్ బోపన్న, బేల ఎం. త్రివేదిలతో కూడిన ధర్మాసనం జైన్‌కు ఈ రిలీఫ్ ను ఇచ్చింది. జైన్ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ కూడా కేసు విచారణను వాయిదా వేసేందుకు అంగీకరించడంతో కోర్టు సెప్టెంబర్ 25కి వాయిదా వేసింది. అంతకుముందు మే 26న, వెన్నెముక శస్త్రచికిత్స కోసం జైన్‌కు సుప్రీంకోర్టు ఆరు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఆ తర్వాత జూలై 24న మధ్యంతర బెయిల్‌ను మరో ఐదు వారాలు పొడిగించింది.

Read Also: Crime News: మేకప్ ఆర్టిస్ట్‌తో ఎఫైర్.. హత్య చేసిన ప్రేమికుడు

జైన్‌తో సంబంధం ఉన్న నాలుగు కంపెనీల ద్వారా మనీలాండరింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలపై ఈడీ గత ఏడాది మే 30న జైన్‌ను అరెస్టు చేసింది. మరోవైపు ఈ కేసులో మరో నిందితుడు అంకుష్ జైన్‌ను వైద్య కారణాలతో నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్‌పై విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తన బిడ్డకు శస్త్రచికిత్స చేయాల్సి ఉందని బెంచ్ పేర్కొనగా.. కోర్టు అతనికి మధ్యంతర బెయిల్ రిలీజ్ చేసింది.