Site icon NTV Telugu

Satyakumar: కేంద్రం ఇచ్చే సొమ్మును మింగేస్తున్నారు..

Satyakumar

Satyakumar

విజయవాడలో బీజేపీ కిసాన్ మోర్చా రైతు గర్జన సభ నిర్వహించారు. ఈ సభకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, సత్యకుమార్, కామినేని శ్రీనివాస్ హాజరయ్యారు. రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి రైతులు భారీ ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ మాట్లాడుతూ.. రైతులను ఆపి అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో వైసీపీ పాలనపై ప్రజలు వ్యతిరేకత చూపిస్తున్నారని ఆరోపించారు. మేనిఫెస్టోలో హామీ ఇవ్వకపోయినా.. 11 కోట్ల రైతన్నలకు డీబీటి ద్వారా మోదీ ఇస్తున్నారని తెలిపారు.

Biren Singh: మణిపూర్ సీఎం సంచలన వ్యాఖ్యలు.. వారందరినీ రాష్ట్రం నుంచి వెళ్లగొడతాం..

రాష్ట్రంలో మంత్రులు వందిమాగధులు నటులు అని సత్యకుమార్ విమర్శించారు. రాష్ట్రంలో బటన్ నొక్కుతున్నారా.. మోదీ వేసిన సొమ్ము లాగేసుకుంటున్నారా అని మండిపడ్డారు. రైతులేమైనా తీవ్రవాదులా.. పాకిస్తాన్ నుంచి వచ్చారా.. 1.76లక్షల కోట్లు రాష్ట్రానికి కేంద్రం ఇస్తే.. రుణమాఫీ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. కేంద్రం రైతులకు ఇస్తే ఇచ్చే సొమ్మును ఇక్కడ ప్రబుద్ధులు వాళ్ళ ఖాతాల్లో వేసుకుని ఉంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోనే రైతుల ఆత్మహత్యల్లో ఏపీ 3వ స్ధానంలో ఉందని సత్యకుమార్ పేర్కొన్నారు.

Ashok Chavan: నిన్న కాంగ్రెస్‌కు రాజీనామా.. నేడు బీజేపీలో జాయిన్

NCRB ప్రకారం రాష్ట్రంలో ఆత్మహత్యల్లో 19% వృద్ధిరేటు సాధించారని సత్యకుమార్ విమర్శించారు. ప్రత్యేక దృష్టితో పోలవరం కోసం రూ.17వేల కోట్లు ఇస్తే అందులోనూ అవినీతేనని ఆరోపించారు. రాష్ట్ర నీటి పారుదల శాఖామంత్రికి డయాఫ్రమ్ వాల్, కాఫర్ డ్యాంకు తేడా తెలీదని కామెంట్స్ చేశారు. వంశధార, సుజలస్రవంతి ఏమయ్యాయో తెలీదు.. రాష్ట్రంలో ప్రాజెక్టులు ఏమయ్యాయో తెలీదు అని అన్నారు. ముందు నాడ కొని గుర్రం ఎప్పుడో కొంటారన్నట్టు కనిపిస్తుంది రాష్ట్రంలో అని దుయ్యబట్టారు. బీజేపీని రాష్ట్రంలో ప్రజలు ఆశీర్వదించాలి అని కోరుతున్నట్లు సత్యకుమార్ తెలిపారు.

Exit mobile version