NTV Telugu Site icon

Zebra Trailer: మెగాస్టార్ చేతుల మీదుగా సత్యదేవ్ ‘జీబ్రా’ ట్రైలర్ విడుదల

Zebra

Zebra

Zebra Trailer: వైవిధ్యమైన పాత్రలతో మెప్పించే సత్యదేవ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలతో తెలుగు సినీ ప్రేక్షకులకు ఎంతగానో చేరువయ్యాడు. ఇకపోతే హీరో సత్యదేవ్ అతి త్వరలో జీబ్రా సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. కన్నడ స్టార్ గాలి ధనుంజయ, ప్రియా భవాని శంకర్, సత్యరాజ్, సునీల్, సత్య, జెనిఫర్ లతో కలిసి సత్యదేవ్ జీబ్రా సినిమాతో వస్తున్నాడు. ఇకపోతే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ను తాజాగా రిలీజ్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా నేడు జీబ్రా సినిమా టైలర్ విడుదల అయింది.

Read Also: Ananya Nagalla : గొప్ప మనసు చాటుకున్న అనన్య నాగళ్ళ.. వీడియో వైరల్

భారీ కాస్టింగ్ తో ఈ సినిమాను తెరకెక్కించారు. పద్మజా ఫిలిమ్స్ బ్యానర్స్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్ పై పద్మజ, ఎస్ ఎన్ రెడ్డి, బాలసుందరం, దినేష్ సుందరంలు నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ సినిమాకు ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించారు. ఇకపోతే ట్రైలర్ విషయానికి వస్తే.. లవ్ స్టోరీ, థ్రిల్లింగ్, కామెడీ కథాంశంతో డబ్బులు చుట్టూ తిరిగే సినిమాగా అర్థమవుతోంది. చూడాలి మరి మరోసారి డిఫరెంట్ కాన్సెప్ట్ తో రాబోతున్న సత్యదేవ్ ప్రేక్షకులను ఎలా మెప్పిస్తాడో. ఇంకెందుకు ఆలశ్యం మీరు కూడా జిబ్రా సినిమా ట్రైలర్ పై ఓ లుక్ వేయండి.

Show comments