NTV Telugu Site icon

Satya Sindhuja: భవిష్యత్ తరాలకు జ్ఞాననిధిలా సింధు మేధో మథనం..

Satya

Satya

ప్రముఖ మోటివేషనల్ ట్రైనర్, ఐఏఎస్ ట్రైనర్ ఆకెళ్ళ రాఘవేంద్ర రావు ఆధ్వర్యంలో సింధు మేధో మథనం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు ప్రముఖ సిద్ధ వైద్యురాలు, ఆధ్యాత్మికవేత్త, డాక్టర్ సత్య సింధూజ తెలిపారు. దాదాపు 100 ఎపిసోడ్‌ల వరకు నడిచే ఈ కార్యక్రమంలో సత్య సింధూజ తన అనుభవాన్ని, తన విశ్లేషణను ప్రేక్షకులతో పంచుకున్నారు. ఈ కార్యక్రమానికి ఆకెళ్ళ రాఘవేంద్ర రావు వ్యాఖ్యాతగా వ్యవహరించగా.. డాక్టర్ సత్య సింధూజ అన్ని ప్రశ్నలకు ఆధ్యాత్మికమైన రీతిలో సమాధానాలు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి కెమెరా, దర్శకత్వ బాధ్యతలు ప్రముఖ కెమెరామెన్, దర్శకులు మీర్ నిర్వహించారు. ఆధ్యాత్మికంగా ఎన్నో అంశాలను, జ్ఞాన సంబంధమైన ఎన్నో అంశాలను, గుప్తంగా ఉన్న ఎన్నో శాస్త్ర విషయాలను ఈ కార్యక్రమంలో చర్చించారు.

Read Also: Spirit: ప్రభాస్ తో కలిసి నటించాలని అనుకుంటున్నారా.. మీకే బంపర్ ఆఫర్?

అద్భుతమైన ఈ కార్యక్రమం భవిష్యత్ తరాలకు జ్ఞాననిధిలా ఉపయోగపడుతుందని సత్య సింధూజ తెలిపారు. అంతేకాకుండా.. స్కాలర్ విద్యార్థులకు, ఇంకా జ్ఞాన దాహం ఉన్నవారికి.. ఆధ్యాత్మికంగా కొత్త విషయాలు తెలుసుకోవాలి అనుకున్న వారికి ఈ కార్యక్రమం ఒక గొప్ప పుస్తకంలా ఉపయోగపడుతుందని డాక్టర్ సత్య సింధూజ, ఆకెళ్ళ రాఘవేంద్ర రావు, డైరెక్టర్ మీర్ చెప్పారు. త్వరలోనే అన్ని ప్రముఖ ఛానెళ్ళలోనూ.. ఇంకా ప్రముఖ మాధ్యమాల ద్వారా రిలీజ్ కాబోతున్న ఈ కార్యక్రమానికి.. మేధావులు, జ్ఞానం పిపాస ఉన్న వారు, విద్యార్థులు ఎంతగానో ఆదరించాలని సత్య సింధూజ విజ్ఞప్తి చేశారు.

Read Also: CM Chandrababu: బడ్జెట్ కూర్పుపై ప్రభుత్వం కసరత్తు.. సీఎం సమీక్ష