Urad Dal Saturday Remedies for Money And Wealth: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని దేవుడుని ‘న్యాయ దేవత’గా పరిగణిస్తారు. ఓ వ్యక్తి యొక్క మంచి, చెడు కర్మల ఫలాన్ని శని దేవుడు నిర్ణయిస్తాడు. ఓ వ్యక్తి జాతకంలో శని బలహీనంగా ఉంటే.. ఆ వ్యక్తి కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అదే సమయంలో శని బలంగా ఉంటే.. ఆ వ్యక్తి జీవితంలో అపారమైన పురోభివృద్ధిని, విజయాన్ని సాధిస్తాడు. అందుకే ఓ వ్యక్తి జీవితంలో శని కీలక పాత్ర పోషిస్తుంది. ఎవరూ కూడా శని గ్రహానికి గురవాలని కోరుకోరు. శని శనిదోషం ఉంటే నివారణ చర్యలు లేదా పరిహారం చేసి శని దేవుని అనుగ్రహం పొందుతారు.
ఓ వ్యక్తి తన జీవితంలో ఆనందం, శ్రేయస్సు పొందడానికి జ్యోతిష్యశాస్త్రంలో అనేక చర్యలు ఇవ్వబడ్డాయి. శని దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి, ఆశీర్వాదాలు పొందడానికి మినప పప్పుకు సంబంధించిన కొన్ని చర్యలు జ్యోతిషశాస్త్రంలో చెప్పబడ్డాయి. శనివారం రోజున మినప పప్పుతో పరిహారం చేస్తే వ్యక్తి జీవితం బాగుంటుందట. ఊహించని సంపద లభిస్తుందట. మినప పప్పుతో చేయాల్సిన కొన్ని నివారణల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
# ఓ వ్యక్తి శని దోషంతో ఇబ్బంది పడుతుంటే.. మినప పప్పు యొక్క ఈ పరిహారం చాలా ప్రభావవంతంగా ఉంటుంది. శనివారం నాడు శని దేవుడిని ఆరాధించండి. పూజలో మినప పప్పు ఉపయోగించండి. పూజ తరువాత మీ తల మీదుగా 3-4 గింజలను తీసివేసి.. కాకికి వేయండి. దీంతో శని దోష ప్రభావం తొలగిపోతుంది.
# జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి యొక్క పనికి పదే పదే ఆటంకాలు జరిగినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా పని జరగకపోయినా.. శనివారం సాయంత్రం కొన్ని మినప గింజలను తీసుకొని వాటిని రావి చెట్టు కింద పోయాలి. పోసాక వెనక్కి తిరిగి చూడొద్దు. ఈ పరిహారాన్ని 11 శనివారాలు చేయడం వల్ల పనిలో ఆటంకాలు తొలగిపోతాయి.
# జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి యొక్క ఆర్థిక పరిస్థితి బాగా లేకుంటే.. శనివారం రాత్రి ఒక పాత్రలో ఆవ నూనెను మీ తల దగ్గర పెట్టుకోండి. మరుసటి రోజు ఉదయం ఈ నూనెలో కుడుములు ఉడకబెట్టి.. పేదలకు ఇవ్వండి. దీనివల్ల మీ ఇంట్లో సంపద రాక మొదలవుతుంది. ఆర్థిక పరిస్థితి కూడా బలపడుతుంది.
# జ్యోతిష్యం ప్రకారం కొత్త వ్యాపారం ప్రారంభిస్తున్నట్లయితే ఇనుప వస్తువు కొనాలి. మీరు వ్యాపారం చేయబోయే ప్రదేశంలో ఉంచి స్వస్తిక్ గుర్తు రాయండి. ఆపై కొన్ని మినప పప్పు గింజలను అక్కడ ఉంచండి. ఇలా చేయడం వల్ల వ్యాపారంలో పురోగతి ఉంటుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
Also Read: Gold Today Price: మగువలకు శుభవార్త.. నేటి బంగారం రేట్లు ఎలా ఉన్నాయంటే?