Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Sathankulam Custodial Death Verdict Madurai Court Awards Death Penalty To 9 Policemen

Sathankulam Case: 9 మంది పోలీసులకు ఉరిశిక్ష.. సాతన్‌కుళం లాకప్ డేత్ కేసులో కోర్టు సంచలన తీర్పు..

Published Date :April 6, 2026 , 7:02 pm
By Venu Goapl Reddy
  • సాతన్‌కుళం లాకప్ డెత్ కేసులో సంచలనం..
  • 9 మంది పోలీసులకు ఉరిశిక్ష విధింపు..
  • పోలీసుల చిత్రహింసల కారణంగా తండ్రీ కొడుకు మృతి..
Sathankulam Case: 9 మంది పోలీసులకు ఉరిశిక్ష.. సాతన్‌కుళం లాకప్ డేత్ కేసులో కోర్టు సంచలన తీర్పు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Sathankulam Case: సాతన్‌కుళం లాకప్ డేత్ కేసులో మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ సంచలన తీర్పు ఇచ్చింది. తండ్రి కొడుకులను లాకప్‌లో చిత్రహింసలు పెట్టి చంపిన కేసులో 9 మంది పోలీస్ అధికారులకు ఉరిశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. 2020లో తూత్తుకుడి జిల్లాలోని సాతన్‌కుళం వద్ద, ఇద్దరు వ్యాపారులు పి. జయరాజ్ అతని కుమారుడు బెనిక్స్‌లు పోలీసు కస్టడీలో చిత్రహింసలకు గురై మరణించిన ఘటనలో దోషులుగా తేలిన తొమ్మిది మంది పోలీసులకు మదురై మొదటి అదనపు జిల్లా సెషన్స్ న్యాయమూర్తి మరణశిక్ష విధించారు.

దోషులుగా తేలిన ఆ తొమ్మిది మందిలో అప్పటి ఇన్‌స్పెక్టర్ ఎస్. శ్రీధర్, సబ్-ఇన్‌స్పెక్టర్లు పి. రఘు గణేష్ మరియు కె. బాలకృష్ణన్, హెడ్ కానిస్టేబుళ్లు ఎస్. మురుగన్ మరియు ఎ. సమిదురై, అలాగే కానిస్టేబుళ్లు ఎం. ముత్తురాజా, ఎస్. వెయిల్ ముత్తు, ఎస్. చెల్లదురై, ఎక్స్. థామస్ ఫ్రాన్సిస్ ఉన్నారు.

కేసు వివరాలు ఇవే:

2020 జూన్ 19న జయరాజ్ తన కుమారుడి మొబైల్ షాప్‌లో ఉన్నప్పుడు, కోవిడ్ -19 కర్ఫ్యూ వేళలు దాటినా కూడా షాప్ తెరిచి ఉంచారనే ఆరోపణలతో వీరిద్దరిని పోలీసులు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. బెనిక్స్ స్టేషన్‌కు వెళ్లి తన తండ్రిని విడుదల చేయాలని కోరినప్పుడు నిందితులైన పోలీసులు బెనిక్స్ కళ్ల ముందే జయరాజ్‌ను తిట్టారు. దీంతో బెనిక్స్, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ ఘటన తర్వాత తండ్రీ కొడుకుల్ని పోలీసులు రాత్రంతా స్టేషన్‌లో ఉంచి తీవ్రంగా చిత్రహింసలకు గురి చేశారు.

ఆ తర్వాత సాతన్‌కుళం జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ వారికి జ్యూడీషియల్ కస్టడీకి అప్పగించారు. వారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకోకుండానే, సరైన వైద్య చికత్స అందించకుండానే మరుసటి రోజు వారిని కోవిల్ పట్టి సబ్ జైలులో బంధించారు. వీరి పరిస్తితి విషమించి 2020 జూన్ 22న కోవిల్‌పట్టి ప్రభుత్వ ఆసుపత్రిలో బెనిక్స్ మరణించగా, ఒక రోజు తర్వాత జయరాజ్ కన్నుమూశారు.

వీరిద్దరి మరణాలపై కోవిల్‌పట్టి తూర్పు పోలీస్ స్టేషన్‌లో 2 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ఈ కేసును మొదట సీబీసీఐడీ విచారించగా, ఆ తర్వాత సీబీఐ దర్యాప్తు చేసింది. నిందితుల్లో ఒకరైన ఎస్ఎస్ఐ పాల్‌దురై ఆగస్టు 2020లో కోవిడ్-19 కారణంగా మరణించారు. మిగిలిన 9 మంది పోలీసులపై సీబీఐ సెప్టెంబర్ 25,2020న ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఈ కేసు మార్చి 10, 2021న మదురైలోని 1వ అదనపు జిల్లా మరియు సెషన్స్ కోర్టులో విచారణకు వచ్చింది. విచారణ జరుగుతున్న సమయంలోనే సీబీఐ ఒక అనుబంధ ఛార్జిషీట్ దాఖలు చేుసింది.

మృతులు దుకాణాన్ని అనుమతించదగిన సమయానికి మించి తెరిచి ఉంచలేదని, వారిపై తప్పుడు కేసు బనాయించారని రెండు ఛార్జిషీట్లలోనూ వెల్లడైంది. ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసిన మహిళా హెడ్ కానిస్టేబుల్ వాంగ్మూలం ప్రకారం, వీరిద్దరిని రాత్రంతా చిత్రహింసలు పెట్టినట్లు తేలింది. పోలీస్ స్టేషన్ వీరిద్దరికి తీవ్రగాయాలై, వీరి రక్తం నేలపై పడితే, వారి దుస్తులతోనే శుభ్రం చేసుకోవాలని పోలీసులు ఆదేశించినట్లు తేలింది.

పోస్ట్‌మార్టం నివేదికలో బెనిక్ శరీరంపై 13 బాహ్య గాయాలు, జయరాజ్ శరీరంపై 17 గాయాలు ఉన్నట్లు తేలింది. వీటి వల్లే ఇద్దరు మరణించినట్లు వెల్లడైంది. నాలుగేళ్లకు పైగా సాగిన సుదీర్ఘ విచారణ అనంతరం, మార్చి 23న కోర్టు తొమ్మిది మంది పోలీసులను దోషులుగా నిర్ధారించింది. కేసును విచారించిన కోర్టు, ఇది అత్యంత అరుదైన కేసుల పరిధిలోకి వస్తుందని, అందుకే మరణశిక్ష విధించాలని సీబీఐ ప్రత్యేక ప్రాసిక్యూటర్ వాదించారు.

బెనిక్స్ గొడవ చేయడం వల్లే పోలీసులు కొట్టారని, దీంట్లో ముందస్తు ప్రణాళిక లేదని నిందితుల తరుఫు న్యాయవాది వాదించారు. ఈ కేసులో దోషుల సంస్కరణపై దృష్టిసారించి, తక్కువ శిక్ష విధించాలని కోరారు. కానీ, రాత్రంతా ఇద్దరిపై దారుణంగా దాడి చేయడం వల్లే దోషులు మరణించినట్లు కోర్టు గ్రహించింది. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు నిందితులకు మరణశిక్ష విధించింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 9 cops death penalty
  • CBI investigation
  • Jeyaraj and Beniks case details
  • Madurai court police conviction
  • Police brutality India death penalty

తాజావార్తలు

  • Sathankulam Case: 9 మంది పోలీసులకు ఉరిశిక్ష.. సాతన్‌కుళం లాకప్ డేత్ కేసులో కోర్టు సంచలన తీర్పు..

  • New Airport: ఆ జిల్లాలో కొత్త ఎయిర్ పోర్ట్‌కు మూహూర్తం ఖరారు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • Artemis 2: అంతరిక్ష ప్రయాణంలో కొత్త చరిత్ర.. చంద్రుడిని చేరిన ఆర్టిమిస్-2

  • TN 2026 Movie: ‘టీఎన్ 26’ సినిమా కాదు, పొలిటికల్ అటాక్.. విజయ్ అభిమానుల ఫైర్!

ట్రెండింగ్‌

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions