NTV Telugu Site icon

Shiv Sena Reddy: క్రీడా ప్రేమికులకు గుడ్‌న్యూస్.. ప్రతి గ్రామంలో సీఎం కప్

Cm

Cm

గ్రామీణ క్రీడలను ప్రోత్సహించాలని తెలంగాణ ప్రభుత్వం సిద్ధం అయ్యిందని.. గ్రామీణ స్థాయి నుంచి సీఎం కప్ ను ఏర్పాటు చేస్తున్నట్లు సాట్ ఛైర్మన్ శివసేనారెడ్డి అన్నారు. ఎల్బీ స్టేడియంలో రేపు సాయంత్రం4గంటలకు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా క్రీడా జ్యోతిని ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. “రాష్ట్రంలో అన్ని జిల్లాలోని పల్లెల్లో ఈ సీఎం కప్ ఉండబోతుంది. ఈనెల 21నుంచి ప్రతి గ్రామంలో గ్రామస్థాయి సీఎం కప్ పోటీలు ప్రారంభమవుతాయి. 6 అథ్లెటిక్స్, కోకో, వాలీబాల్, ఏర్పాటు చేశాం. 21నుంచి 24 వరకు గ్రామీణ స్థాయి పోటీలు నిర్వహిస్తాం. 24 నుంచి 30 వరకు మండల స్థాయి పోటీలు ఉంటాయి. నవంబర్8th నుంచి 13 వరకు జిల్లా స్థాయి పోటీలు ఉంటాయి. 28నవంబర్ డిసెంబర్ 5వరకు రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహిస్తాం. గతంలో ఎన్నడూ లేని విధంగా క్రీడాపోటీలు ఏర్పాటు చేస్తున్నాం. రాజకీయాలకు తావులేకుండా క్రీడాపోటీలు జరుపుతాం. సీఎం రేవంత్ రెడ్డి సూచనలతో ముందుకెళ్తున్నాం..” అని సాట్ ఛైర్మన్ తెలిపారు.

READ MORE: AP Cabinet: ఈ నెల 10న ఏపీ కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై చర్చ..!

పల్లెల్లో యువత స్వచ్ఛందంగా ముందుకు రావాలని సాట్ ఛైర్మన్ శివసేనారెడ్డి సూచించారు. “గ్రామీణ క్రీడాకారుల కోసం యజ్ఞం లాగా సీఎం కప్ ఉండనుంది. రెండు నెలల్లో ఆటల పండుగ సంబరం..21నుంచి ప్రతి గ్రామంలో ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు ప్రారంభిస్తారు.. జిల్లా లెవెల్ లో కలెక్టర్ అధ్యక్షతన ప్రారంభిస్తారు..10ఏండ్లు క్రీడాకారులు నిరుత్సాహంతో ఉన్నారు.. ఇప్పుడు ప్రోత్సహిస్తున్నాం.. ప్రభుత్వం వచ్చి 8నెలలు అవుతుంది.. క్రీడాస్ఫూర్తితో ముందుకెళ్తున్నాం..రూ.361కోట్లు స్పోర్ట్స్ అథారిటీ కి నిధులు కేటాయించారు.. గ్రామీణ స్థాయి యువత చెడు అలవాట్లకు లోనవుతున్నారు.. యువత భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకొని క్రీడలు ఆడేలా చేస్తున్నాం.. క్రీడా ప్రాంగణాలు కబ్జాలకు గురవుతున్నాయి.. గ్రామీణ స్థాయిలో గ్రౌండ్స్ ఉండేలా చేస్తాం.. గ్రామీణ యువత క్రీడలపై దృష్టి పెట్టాలి.. రాజకీయాలకు తావు లేకుండా క్రీడాలను సాట్ ప్రోత్సహిస్తుంది.” అని తెలిపారు.